మైనర్‌పై లైంగికదాడి, టీడీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోండి: వైసీపీ డిమాండ్
టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ మైనర్ తనువు చాలించింది. తనను సదరు నేత బ్లాక్ మెయిల్ చేయడంతో సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో జరిగింది. బాలిక మృతికి కారణమైన టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
ఎర్రబెల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో ఇంతియాజ్ పరిచయం చేసుకున్నాడు. ఫేస్ బుక్‌లో ఫ్రెండ్ షిప్ చేశారు. ప్రేమిస్తున్నానని చెప్పాడని.. లైంగికంగా వేధించాడట. ఈ మేరకు ఆ యువతి సెల్పీ వీడియోలో తెలిపింది. అంతేకాదు తాను చెప్పినట్టు చేయకుంటే మార్పింగ్ ఫోటోలు ఆన్ లైన్‌లో ఉంచుతానని బెదిరించాడట. అందుకే ఆ బాలిక సూసైడ్ చేసుకుంది. ఇంతియాజ్‌ను కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

మైనర్ బాలికపై బలవంతం చేసిన టీడీపీ నేత ఇంతియాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. కదిరిలో ఇంటర్ చదువుతున్న.. బాలికను మభ్యపెట్టి మోసం చేశాడని ఆరోపించింది. ఘటనను మహిళా కమిషన్ కూడా ఖండించింది. టీడీపీ నేతలు కొందరు ఇలాంటి ఘటనలు చేస్తున్నారని ఫైరయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. సదరు పార్టీ నేతలపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు.
ఇలాంటి ఘటనలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోరని చెప్పారు. తర్వాత సత్యసాయి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనపై పూర్తి విచారణ జరపాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications