అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్‌లుగా గుర్తించారు.
ప్రమాద సమాచారం అందగానే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బొలెరో వాహనం నుంచి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొలెరో వాహనం అనంతపురం నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఆ వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగంతో ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

రెండు నెలల క్రితం ఇదే అనంతపురంలో ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సంలో ఒకరు మృతి చెందారు. హిందూపురం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. జిల్లా కలెక్టర్ వద్ద రెండు కార్లు,ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Recommended Video
గత నెలలో నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. రాజమండ్రికి చెందిన వీరయ్య, వరలక్ష్మి దంపతులు, మణికంఠ, స్వాతి దంపతులు ప్రాణాలు కోల్పోగా.. లిఖిత అనే యువతి గాయాలతో బయటపడింది. ఆ కుటుంబం దైవదర్శన నిమిత్తం తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఇదే నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications