కారులో ఇరుక్కున్న మృతదేహాలు: 11 మంది మృతికి కారణం ఇదే..! (ఫోటోలు)
విశాఖపట్నం: సెలవు కావడంతో తలుపులమ్మ తల్లి దర్శనానికి బయలుదేర్దిన ఓ కుటుంబసభ్యులు ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయి. విశాఖ జిల్లా నక్కపల్లి సమీపం వెదుళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఎవరి తప్పూ లేకపోయినా కేవలం ఓ టైరు పేలిన ఘటనలో 11 మంది చనిపోయారు.
వివరాల్లోకి వెళితే... ఎన్‌ఏడీ దరి బుచ్చిరాజుపాలేనికి చెందిన ఈదలాడ శ్రీను తన కుటుంబంతోపాటు, వదిన, వారి పిల్లలను తీసుకుని తలుపులమ్మతల్లి దర్శనానికి కారులో బయలుదేరాడు. నక్కపల్లిదాటి వెదుళ్లపాలెం సమీపానికి రాగానే టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.
కారులో ఉన్నవారంతా ఏం జరిగిందో తెలుసుకునేలోపే క్షణాల్లో భారీ పైపులతో వచ్చిన లారీ కారుని నుజ్జునుజ్జు చేసింది. రెండు ప్రమాదాల్లో 11 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముఖ్యంగా లారీ కారుని తొక్కుకుని వెళ్లడంతో, కారు ఇంజిన్‌కింద చిక్కుకుపోయి తుక్కుతుక్కయ్యింది. ఇందులోని వారంతా దుర్మరణం చెందడంతోపాటు శరీరభాగాలన్నీ మాంసపు ముద్దలైపోయాయి.
ప్రమాదంలో మృతిచెందిన వారిలో సగం మంది చిన్నపిల్లలే ఉండటం ప్రతిఒక్కరినీ కదిలించింది. ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకున్న స్థానికులు కంటతడి పెట్టారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరుకు చెందిన దాట్ల చిరంజీవిరాజు ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా గతంలో హైదరాబాద్‌లో పనిచేశారు.
అయితే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్దామనుకున్న ఆయనకు నక్కపల్లి సమీపంలో ఉన్న హెటిరో మందుల పరిశ్రమలో సుమారు మూడేళ్ల క్రితం హెచ్.ఆర్. విభాగంలో ఉద్యోగం లభించింది. అప్పట్నుంచి భార్యాపిల్లలతో కలిసి పాయకరావుపేటలో నివాసం ఉంటున్నారు. సెలవు దినాల్లో పిల్లలతో కలిసి పెదగుమ్ములూరు వస్తుంటారు.
భార్య, మూడేళ్ల కుమార్తెని వదిలి ఆదివారం ఇదే విధంగా కొడుకు అనంతవర్మతో కలిసి ద్విచక్ర వాహనంపై పెదగుమ్ములూరు బయలుదేరారు. అనుకోకుండా వీరిద్దరూ కూడా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఎండకు మండుతున్న రోడ్డు... కార్ల టైర్లలోనూ గాలి వేడెక్కడంతో కారు టైరు పగిలిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు ఐదుగురు ప్రయాణించాల్సిన కారులో... తొమ్మిది మంది... కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఓవర్‌లోడు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
విశాఖ నగరంలోని బుచ్చిరాజుపాలెం, కరాస ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన బంధువులు ఆదివారం ఉదయం తలుపులమ్మతల్లి దర్శనానికి కారులో బయలుదేరారు. కారులో నక్కా వెంకట లక్ష్మి (60), ఆమె పెద్దకుమార్తె కడియం పద్మ (40), మనవడు కుమార్ (19), మనవరాలు సాయిలక్ష్మి (16), రెండో కుమార్తె ఈదలాడ దేవి, ఈమె భర్త శ్రీనివాసరావు, పిల్లలు సాయి ధనుంజయ (13), పవన్ (10), దుర్గ అపర్ణ (6) ఉన్నారు.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
వీరు వెళ్తున్న కారు నక్కపల్లి సమీపంలోని వెదుళ్లపాలెం దగ్గరకు వచ్చేసరికి టైర్ పంక్చరైంది. వేగంగా వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని విశాఖ వైపు భారీ ఇనుప పైపులతో వస్తున్న భారీ ట్రాలర్ కిందకు దూసుకెళ్లింది. వేగంగా వస్తున్న ట్రాలర్ బానెట్‌కు ట్రాలీకి మధ్య ఖాళీలో ఇరుక్కున్న కారును ట్రాలర్ 10 మీటర్ల వరకూ ఈడ్చుకుని పోయింది.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. ఇదే సందర్భంలో పాయకరావుపేట నుంచి పెదగుమ్ములూరుకు మోటార్ సైకిల్‌పై కుమారుడు అనంతసాగర వర్మ (7)తో కలిసి వెళ్తున్న దాట్ల చిరంజీవి రాజు (41)ను ట్రాలర్ ఢీకొట్టింది. దీంతో సాగరవర్మ అక్కడికక్కడే మృతి చెందగా, చిరంజీవి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న చిరంజీవి రాజును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
ప్రమాదంలో భారీ ట్రాలర్ బాయినెట్‌కు, వెనుక ట్రాలీకి మధ్యలో చిక్కుకున్న కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అసలు కారులో ఎంతమంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి, ఎవరైనా ప్రాణాలతో మిగిలితే రక్షించేందుకు సైతం సాధ్యం కాని విధంగా ట్రాలర్ మధ్యలో కారు చిక్కుకుపోయింది.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న నక్కపల్లి, పాయకరావుపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని కారును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇనుప పైపులను క్రేన్‌ల సహాయంతో తొలగించి ట్రాలర్ బాయినెట్ కింద చిక్కుకున్న కారును బయటకు తీశారు.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
అప్పటికే కారులో ఉన్నవారంతా మృత్యువాత పడినట్టునిర్ధారించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు సైతం పోలీసులకు, సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన వారికి కష్టతరమైంది. కారు భాగాలను వేరు చేసి మృత దేహాలను బయటకు తీశారు.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెసుకున్నారు.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
మృతుల కుటుంబాలకు సిఎం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద మృతదేహాలకు తక్షణమే పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని నర్సీపట్నం ఆర్డీఓను ఆదేశించారు. సంఘటన స్థలానికి తక్షణమే వెళ్లి పోస్టుమార్టం పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే గోపాలపట్నం సమీపంలోని మృతుల కుటుంబాలకు అవసరమైన తక్షణ సాయాన్ని అందించాల్సిందిగా విశాఖపట్నం ఆర్డీవోను ఆదేశించారు.

కారులో ఇరుక్కున్న మృతదేహాం: 11 మంది మృతికి కారణం ఇదే..!
జరిగిన సంఘటన పట్ల జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున రూ.లక్ష చొప్పున నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications