ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్నంటే..? పెరిగిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 29,122 నమూనాలను పరీక్షించగా.. 117 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,89,916కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
గత 24 గంటల్లో కరోనాతో ఎవరూ కూడా మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7169 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 66 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,029కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,39,54,131 కరోనా నమూనాలను పరీక్షించారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 4, చిత్తూరులో 41, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 17, కడపలో 8, కృష్ణాలో 11, కర్నూలులో 2, నెల్లూరులో 9, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 6,
విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,752 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731 చేరింది. గత 24 గంటల వ్యవధిలో 113 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,051కు చేరింది. కాగా, నిన్న ఒక్కరోజే 11,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,07,75,169కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,64,511 యాక్టివ్ కేసులున్నాయి.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications