పెళ్లింట మృత్యు ఘోష: కాళ్లు, చేతులు, తలలు తెగి పడ్డాయి (ఫోటోలు)

ప్రకాశం జిల్లా వలివేటివారిపాలెం మండలం చెర్లోపల్లి వద్ద శనివారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడిక్కకడే మరణించారు.

మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డీసీఎం వ్యాన్ వెనక భాగాన్ని బస్సు ఢీకొనడంతో అది ఊడిపోయి 20 అడుగుల దూరంలో పడింది.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి వ్యాన్‌లో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరుకు చెందిన సమాధి సుబ్బారావు కుమార్తె సురేఖ వివాహం వలివేటివారిపాలెం మండలం సీతారామపురం కూరేటిపల్లికి చెందిన పిన్నిబోయిన మాల్యాద్రి కుమారుడు మహేంద్రతో శనివారం ఉదయం ఏడుగంటలకు మాలకొండలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరగాల్సి ఉంది.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి కుమార్తెను ముందురోజు రాత్రే కారులో పంపించి.. బంధువులు, ఊరి జనం అశోక్‌లేల్యాండ్ వ్యాన్‌లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరారు. మధ్యలో చెమిడిదెపాడులో మరో ముగ్గురు బంధువులను ఎక్కించుకొని గుడ్లూరు మీదుగా కందుకూరు దాటి రెండు కిలోమీటర్లు వెళ్లారు.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

మరో అరగంటలో గమ్యస్థానం చేరుకునేలోగా ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఎదురుగా కృష్ణా ట్రావెల్స్‌కు చెందిన బస్సు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. సింగిల్‌రోడ్డు కావడం, వాహనాన్ని రోడ్డు పక్కకు తీసేలోగానే ఇంజన్ వెనకున్న బాడీని బలంగా ఢీకొట్టడంతో వ్యాన్ నుంచి బాడీ వేరుపడి 20 అడుగుల దూరంలో పడింది.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

అక్కడికక్కడే 13 మంది చనిపోగా, ఇద్దరు కందుకూరు ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 51 మంది ఉన్నారు. కాళ్లు, చేతులు, తలలు తెగి ఎక్కడికక్కడ పడిపోయాయి. మృతుల్లో 9 మంది ప్రకాశం జిల్లావాసులు కాగా.. ఆరుగురు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వ్యాన్‌ను ఢీకొన్నాక బస్సు పక్కనే ఉన్న గుంతలో పడి దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

షార్ట్‌సర్క్యూటవడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. బస్సుడ్రైవర్ బయటపడినా.. అందులోని వంటమాస్టర్‌ను అక్కడి ప్రజలు రక్షించారు. తరువాత కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో బస్సులో ఉన్న మూడు సిలిండర్లలో ఒకటి పేలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంతో చేవూరులో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు పెద్దసంఖ్యలో కందుకూరు తరలివచ్చారు.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పలువురు నేతలు, అధికారులు పరామర్శించారు. మంత్రి శిద్దా రాఘవరావు, వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బాలావీరాంజనేయస్వామి పరామర్శించారు.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

పెళ్లి బృందంలో 15 మంది దుర్మరణం

ప్రకాశం జిల్లా చెర్లోపల్లి వద్ద జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణించడం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు.

రోడ్డుప్రమాద మృతులు వీరే

రోడ్డుప్రమాద మృతులు వీరే

ప్రకాశం జిల్లా వాసులు: నక్కల సుభాషిణి(35), తోడేటి ప్రసాద్(23), తోడేటి చిరంజీవి(45), రాయిని సుబ్బయ్య(50), ఏలగాల సుబ్బయ్య(75), సమాధి నాగమ్మ(65) , మెటుపల్లి పద్మ(45), శింగమనేని వెంకటేశ్వర్లు(47), కొల్లి సుశీల(47).

రోడ్డుప్రమాద మృతులు వీరే

రోడ్డుప్రమాద మృతులు వీరే

నెల్లూరు జిల్లా వాసులు: సన్నెబోయిన రాజమ్మ, బూపాటి హజరత్తయ్య(29), సమాధి రంగయ్య(25), సన్నెబోయిన చందు(10), సన్నెబోయిన శ్రీలేఖ(12), సన్నెబోయిన ఆదినారాయణ(7).

ప్రమాదానికి కారణం బస్సు డ్రైవరే

ప్రమాదానికి కారణం బస్సు డ్రైవరే

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణం శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవరేనని ప్రకాశం జిల్లా ఏఎస్పీ రామానాయక్ తెలిపారు. ట్రావెల్స్ నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రమాద ఘటనా స్థలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+