అమరావతి శంకుస్థాపన: 16 హెలికాప్టర్లు, 9 హెలిప్యాడ్లు సిద్ధం

గుంటూరు: ఈనెల 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు, న్యాయమూర్తులు వంటి అతిరథ మహారథులు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు.

దీంతో ఏపీ ప్రభుత్వం భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తుంది. శంకుస్థాపన కోసం రాజధాని అమరావతిలో మొత్తం 16 హెలికాప్టర్లు, 9 హెలిప్యాడ్లను సిద్ధం చేయనున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి వచ్చే నేతలు గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో శంకుస్థాపన ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే 250 ఎకరాలను రాజధాని శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడ నుంచి రహదారుల వెడల్పు చేసి ఉద్దండరాయునిపాలెంకు రహదారులను అనుసంధానం చేయనున్నారు.

16 Helicopters and 9 Helipads for ap capital amaravati foundation day

దీనికి సంబంధించిన భూమిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాజధాని శంకుస్థాపన అనంతరం 50 ఎకరాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి లక్షమంది కోసం చూసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సభలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, సింగపూర్‌, జపాన్‌ మంత్రులు ప్రసంగించనున్నారు.

రాజధాని శంకుస్థాపన రోజైన అక్టోబర్ 22 నుండి వారం రోజుల పాటు నవరాత్రులు రాజధాని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. శంకుస్థాపన అనంతరం లేజర్ షోలు, ఇతర విద్యుద్దీపాల ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వాహణ బాధ్యతలను ముంబైలోని విజ్‌క్రాఫ్ట్ వరల్డ్ ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థకు అప్పగించారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 10 కోట్లు చెల్లిస్తుంది.

రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపనకు వచ్చే వీఐపీల కోసం ప్రవేశద్వారాలు, బారికేడ్లు, సౌండ్ సిస్టం, లైటింగ్, జనరేటర్లు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, ముఖ్య అతిథులకు అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర వ్యవహారాలన్నీ ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థకే అప్పగించారు.

మరో పక్క రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు వీలుగా నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌కు అనుమతి ఇచ్చినట్టు కూడా సమాచారం. తొమ్మిది రోజుల పాటు జరిగే ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపన పనులకు కలిపి దాదాపు 50 కోట్ల రూపాయలు వెచ్చించనుంది.

అమరావతి శంకుస్థాపనకు అవసరమైన మట్టిని రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని గ్రామాల నుండి సేకరిస్తుంది. రాజధాని గ్రామ ప్రాంతాల ప్రజలు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా మంత్రులు ఇప్పటికే స్థానిక ప్రజలతో చర్చించారు. అందరూ సంయమనంతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేలా ఇప్పటికే శిక్షణ తరగతులు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+