కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా కొత్త కేసులు, మరణాల లెక్క ఇదే , కరోనాపై సమీక్షలో జగన్ చెప్పిందిదే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఊగిసలాట కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు కాస్త తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 1601 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,06,191కి చేరుకుంది.

Corona Cases In India: మళ్ళీ భారీగా .. 37,593 కరోనా కొత్త కేసులు, 648 మరణాలు, కేరళలో పంజా !! Corona Cases In India: మళ్ళీ భారీగా .. 37,593 కరోనా కొత్త కేసులు, 648 మరణాలు, కేరళలో పంజా !!

ఏపీలో 14,061 కరోనా యాక్టివ్ కేసులు
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71,532 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు అధికారులు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో నమోదైన 16 మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,766 కు చేరుకుంది. ఇక కరోనా మహమ్మారి బారినుండి గత 24 గంటల్లో 1201 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ ల సంఖ్య 19,78,364 కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 14,061 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

1601 Corona new cases ,16 deaths in AP ; Jagan key orders in the review on Corona !!

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా 273 కరోనా కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 221 కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా చిత్తూరు జిల్లాలో 217 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 208 కరోనా కేసులు నమోదయ్యాయి.

కర్నూలులో అత్యల్పంగా కరోనా కేసులు
ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 123 కరోనా కేసులు, కృష్ణాజిల్లాలో 116 కేసులు, ప్రకాశం జిల్లాలో 124 కేసులు నమోదైనట్లు గా తెలుస్తోంది . ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో 108 కరోనా కేసులు, విశాఖపట్నంలో 98 కరోనా కేసులు, విజయనగరంలో 40 కరోనా కేసులు , శ్రీకాకుళంలో 37 కరోనా కేసులు, అనంతపురం జిల్లాలో 26 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా పరిస్థితిపై సమీక్షించిన్ జగన్ .. అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు రికవరీ రేటు 98.63% గా ఉన్నప్పటికీ, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉందని గణాంకాలు అంకెలతో సంబంధం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

85 శాతం ప్రజలకు రెండు డోసులు పూర్తిగా ఇచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలి
వివాహ వేడుకల్లో 150 మందికి మించి ఉండరాదని, ఇక విద్యాసంస్థల్లో పాటించాల్సిన కరోనా నిబంధనలను కూడా విడుదల చేశామని వెల్లడించారు. కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటికి సర్వే నిర్వహించాలన్న జగన్ కోవిడ్ లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలని వెల్లడించారు. 85 శాతం ప్రజలకు రెండు డోసులు పూర్తిగా ఇచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని, సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రతి ఇంట్లో వ్యాక్సిన్లను పూర్తిచేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక ఆస్పత్రులలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

English summary
In the last 24 hours, 1601 people have been infected with corona and 16 deaths in AP. This brings the total number of corona victims in the state of Andhra Pradesh to 20,06,191. Jagan wants to be strict about corona rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X