మొఘల్‌ కాలంనాటి ఫిరంగి స్వాధీనం(ఫోటోలు)

హైదరాబాద్: మొఘల్ కాలం నాటి పురాతన ఫిరంగి హైదరాబాద్‌లో బయటపడింది. దీన్ని సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత బస్తీలోని నయాపూల్ ప్రాంతంలో లతీఫ్ అనే కాంట్రాక్టర్ భవన నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా పురాతన ఫిరంగి బయటపడింది.

17th century cannon found in hyderabad

800 కిలోల బరువున్న ఈ ఫిరంగి ఇనుము, జింక్, సీసం తదితర మెటిరియల్స్‌తో తయారు చేశారని అదనపు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు గోల్కొండ కోటపై రెండోసారి దాడి చేసిన సమయంలో ఈ ఫిరంగిని వాడి ఉంటారని పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఫిరంగిని పురావస్తు శాఖకు అప్పగించారు.

17th century cannon found in hyderabad

ఈ ఫిరంగులను 20వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో అసఫ్ జాహి రాజవంశం పాలకులు ఉపయోగించారు. 14వ శతాబ్ధంలో ఈ ఫిరంగులను ఢిల్లీ సుల్తానులు కాకతీయులకు చెందిన వరంగల్ కోటపై దాడి చేసేందుకు ఉపయోగించారని పురాతత్వ అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+