'అనంత'లో బోల్తా పడ్డ కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సు: 18 మందికి గాయాలు

అనంతపురం: హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున వోల్వో బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.

18 people injured in KSRTC Bus Accident at Anantapur

బెంగళూరు నుంచి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

4 కిలోల బంగారం చోరీ:

కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న కేశినేని ట్రావెల్స్‌ బస్సులో మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజీ వద్ద 4 కిలోల బంగారం చోరీకి గురైంది. ఇటిక్యాలపాడు వద్ద టీ తాగేందుకు బస్సు ఆపినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

బంగారంతో ఆగంతకుడు కారులో పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+