మహిళల భద్రత: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

హైదరాబాద్: మహిళల భద్రతపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన గురవారం సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా భద్రతా కమిటీ సభ్యులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రతా కమిటీ చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలోనూ మహిళలకు సంబంధించిన కేసుల విచారణకు డిఎస్పీ స్ధాయిలో ఓ మహిళా అధికారిని నియమిస్తామన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

181 helpline for women safety says telangana cm kcr

తీసుకున్న కీలక నిర్ణయాలు:

* మహిళల కోసం 181 హెల్ప్ లైన్ ఏర్పాటు
* మహిళా పోలీసుల నియామకానికి వెంటనే ప్రకటన
* అశ్లీల వెబ్ సైట్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
* రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలి
* పునరావాస కేంద్రాల్లోని మహిళలకు భృతి పెంపు
* ఈవ్ టీజింగ్ అరికట్టేందుకు ప్రత్యేక చట్టం
* బస్సుల్లో మహిళల సీట్ల వెనుక జాలీలు ఏర్పాటు చేయాలి
* అకతాయిల ఛాయాచిత్రాలు, వేలిముద్రలు సేకరించాలి
* బాలికలకు స్వీయ రక్షణ కోసం శిక్షణ ఇస్తాం
* మహిళల కేసులకు అన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
* ప్రతి జిల్లాలో డిఎస్పీ స్ధాయి మహిళా అధికారి నియామకం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+