వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్ నుంచి తిరిగొచ్చిన టి, ఏపి వాసులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇరాక్‌ అంతర్యుద్ధంలో చిక్కుకున్న 193 మంది తెలుగువారు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల ద్వారా ఢిల్లీ చేరుకున్న వారికి అధికారులు స్థానిక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి భవన్‌లో బస ఏర్పాటు చేశారు. వీరిలో 25 మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ వాసులు కాగా, మిగతా వారంతా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందినవారున్నారు. వీరిని వారివారి స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఉపాధి కోసం వెళ్లిన తాము అక్కడ చాలా ఇబ్బందులకు గురైనట్లు భారత్‌కు తిరిగివచ్చిన తెలుగువాళ్లు చెప్పారు. తమను బానిసలుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాల్లోని భారతీయులు ఆర్థిక ఇబ్బందులు, ఇతర వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆ దేశంలోని భారత రాయబారి సీతారాం పేర్కొన్నారు. 2011 నుంచి ఏటా వందమంది భారతీయులు ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన వివరించారు.

వీరిలో అప్పుల బాధతో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ నమోదైన 544 మరణాల్లో 37 మంది భారతీయులవే కావడం గమనార్హం. కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం, మానసిక ఒత్తిడి, రుణభారం తదితర కారణాలతో ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని సీతారాం తెలిపారు.

తమ సహోద్యోగుల్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చేయూత నివ్వాల్సిందిగా అక్కడి భారత సంతతి ప్రజలను కోరారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు వెంటనే తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా, స్నేహితుల సహాయం తీసుకుని దాన్నుంచి బయటపడాలని, అందరూ కలిసికట్టుగా ఉంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చని సీతారాం పేర్కొన్నారు.

టి, ఏపివాసులు

టి, ఏపివాసులు

ఇరాక్‌ అంతర్యుద్ధంలో చిక్కుకున్న 193 మంది తెలుగువారు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల ద్వారా ఢిల్లీ చేరుకున్న వారికి అధికారులు స్థానిక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి భవన్‌లో బస ఏర్పాటు చేశారు.

టి, ఏపివాసులు

టి, ఏపివాసులు

వీరిలో 25 మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ వాసులు కాగా, మిగతా వారంతా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందినవారున్నారు. వీరిని వారివారి స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

టి, ఏపివాసులు

టి, ఏపివాసులు

ఉపాధి కోసం వెళ్లిన తాము అక్కడ చాలా ఇబ్బందులకు గురైనట్లు భారత్‌కు తిరిగివచ్చిన తెలుగువాళ్లు చెప్పారు. తమను బానిసలుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

టి, ఏపివాసులు

టి, ఏపివాసులు

కాగా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాల్లోని భారతీయులు ఆర్థిక ఇబ్బందులు, ఇతర వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆ దేశంలోని భారత రాయబారి సీతారాం పేర్కొన్నారు.

టి, ఏపివాసులు

టి, ఏపివాసులు

2011 నుంచి ఏటా వందమంది భారతీయులు ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన వివరించారు.

టి, ఏపివాసులు.

టి, ఏపివాసులు.

వీరిలో అప్పుల బాధతో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ నమోదైన 544 మరణాల్లో 37 మంది భారతీయులవే కావడం గమనార్హం.

English summary
193 workers belongs to AP and Telangana states, came from iraq to delhi On Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X