అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వికృత క్రీడకు 85 మంది బలి - పైసా లేకుండా పాలనన్న టీడీపీ - విజయసాయిరెడ్డి మళ్లీ వేశారు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయంటూ జగన్ సర్కారు ఇచ్చిన గెజిట్ నోట్ పై హైకోర్టు స్టే విధించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ ప్రయత్నాలు, పరిణామాలు క్రమంగా మారుతున్నప్పటికీ, అమరావతి రైతులు మాత్రం పట్టువదలకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. అమరావతిలో రైతుల నిరసనలు ఆదివారం నాటికి 250 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నేతలు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడగా, వైసీపీ నేతలు కూల్ గా కౌంటర్లిస్తున్నారు.

సోనియాకు సీనియర్ల ఘాటు లేఖ - కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన - రేపు సీబడ్ల్యూసీ అనగా..సోనియాకు సీనియర్ల ఘాటు లేఖ - కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన - రేపు సీబడ్ల్యూసీ అనగా..

జగన్ మూర్ఖపు ఆలోచన..

జగన్ మూర్ఖపు ఆలోచన..

‘‘పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం. సీఎం జగన్ మూడు ముక్కలాట ఒక ఒక వికృత క్రీడ. మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతు న్యాయం చెయ్యమంటూ రణభేరి మొదలుపెట్టి నేటికి 250 రోజులు అయ్యింది. ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. రాజధాని ని మూడు ముక్కలు చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ముందుకు రావాలి''అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

ఆంధ్రకేసరికి నివాళి..

ఆంధ్రకేసరికి నివాళి..

స్వాంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ లో నివాళి అర్పించారు. ‘‘పాఠశాలకు ఫీజు కట్టలేనంత నిరుపేద స్థితి నుంచి, న్యాయవాదిగా ఆ రోజుల్లో వేల రూపాయల ఫీజు తీసుకునే స్థాయికి ఎదిగి... దేశం కోసం ఆ వృత్తిని తృణప్రాయంగా వదిలేసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు టంగుటూరి ప్రకాశం పంతులుగారు. సాహసానికి, త్యాగానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?'' అంటూ మహానేతను గుర్తుచేసుకున్నారు.

సిగ్గుంటే అలా అనరు..

సిగ్గుంటే అలా అనరు..

అమరావతి గురించి సీఎం జగన్, వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా అదనంగా పెట్టకుండా జగన్ అమరావతి నుంచే పరిపాలిస్తున్నారని గుర్తుచేశారు. ‘‘శ్మశానం, మునిగిపోతుంది, గ్రాఫిక్స్, ఖర్చెక్కువ.. అన్న చోట నుంచే రూపాయి అదనపు పెట్టుబడి పెట్టకుండా 15 నెలలుగా పరిపాలన కొనసాగిస్తూ.. తిరిగి అమరావతి పై విషం కక్కడానికి సిగ్గుగా లేదా సీఎం జగన్ గారు? అమరావతి రైతుల మరణాలకు కారణమైన మీరు వారికీ క్షమాపణ చెప్పి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నాం అని ప్రకటించండి. 250 రోజులుగా రాజధాని రణభేరి లో పాల్గొంటున్న రైతులకు నా జోహార్లు''అని వెంకన్న వ్యాఖ్యానించారు.

అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..

 జగన్ తగ్గేదాకా పట్టువదలం

జగన్ తగ్గేదాకా పట్టువదలం

విశాఖపట్నంలో వైసీపీ భూపందేరాలకు పాల్పడుతోందంటూ కొంతకాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న టీడీపీకే చెందిన మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అమరావతి ఉద్యమ్యం 250 రోజులపై స్పందించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ చేసిన ఏ ఒక్క ఆరోపణనూ నిరూపించలేకపోయారని, సీఎం జగన్, వైసీపీ నేతల స్వార్ధ ప్రయోజనాలే తప్ప.. రాజధానిని ముక్కలు చెయ్యడంలో ప్రజా ప్రయోజనం లేదని అయ్యన్న మండిపడ్డారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని టీడీపీ విధానమని, అసలు మూడు ముక్కలాటతో ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పే దమ్ము జగన్ కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని రణభేరి మొదలై 250 రోజులైందని, జగన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని అయ్యన్న స్పష్టం చేశారు.

చంద్రబాబుకు మాత్రం కడుపు మంట..

చంద్రబాబుకు మాత్రం కడుపు మంట..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రెండో ఏడాది కూడా వర్షాలు పుష్కలంగా కురిశాయని, ఈసారి కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ఇతర జలాశయాలు నిండుకుండల్లా మారాయని, నదీ నదాలు పరవళ్లు తొక్కులున్నవేళ రాష్ట్రంలో సంతోషాల పంట ఉంటే.. చంద్రబాబుకు మాత్రం కడుపు మంట పెరిగిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పెరిగిన కడుపు మంట.

Recommended Video

Godavari Floods : తక్షణమే Polavaram Project పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి - Pawan Kalyan || Oneindia
టంగుటూరితో జగన్‌కు పోలిక..

టంగుటూరితో జగన్‌కు పోలిక..

ఆంధ్రకేసరి, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఎంపీ సాయిరెడ్డి అనూహ్య కామెంట్లు చేశారు. ఆ మహానేతను, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ ను పోల్చిచూపారు. ‘‘నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే నాయకులు రాజకీయాల్లో చాలా అరుదు. అలాంటి దమ్మున్న తొలితరం నాయకుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారైతే, నేటి తరం నాయకుడు ముఖ్యమంత్రి జగన్. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి 149వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు''అని సాయిరెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు.

English summary
protests at Amaravati reaches 250 days on sunday. opposition tdp nara lokesh and other leaders slams cm jagan for taking u turn on capital. tdp leaders extend support to farmers protest. other side, ysrcp mp vijaya sai reddy criticizes chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X