ఏపీలో కరోనా 2918, 7.86 లక్షలకు చేరిన మొత్తం కేసులు, 24 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం కంటిన్యూ అవుతోంది. టెస్టులు పెరుగుతున్న కేసులు కూడా వస్తోన్నాయి. అయితే గతంలో మాదిరిగా 10 వేల చొప్పున కాక.. 2 నుంచి 3 వేల వరకు వస్తున్నాయి. గత 24 గంటల్లో కూడా 3 వేల వరకు కేసులు వచ్చాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

ఏపీలో గత 24 గంటల్లో 61 వేల 330 శాంపిళ్లను పరీక్షించారు. అయితే 2 వేల 918 మందికి వైరస్ సోకింది. దీంతో కరోనా వచ్చిన మొత్తం సంఖ్య 7 లక్షల 86 వేల 50కి చేరుకుంది. వీరిలో 35 వేల 65 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 4 వేల 303 మంది కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ పేర్కొన్నది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకి 24 మంది చనిపోయారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య 6 వేల 453 మందికి చేరింది.

2918 corona cases register in andhra pradesh

ఇప్పటివరకు 71 లక్షల 27 వేల 533 పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో తెలిపింది. చనిపోయిన వారి వివరాలను జిల్లాలవారీగా ప్రకటించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలో నలుగురు.. కడపలో 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున చనిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+