ఒక్క యాడ్ కోసం రాజమౌళి పారితోషికం?
దర్శక ధీరుడు రాజమౌళి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు భారతీయ సినీ పరిశ్రమలో టాప్ దర్శకుడిగా వున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారారు. తెలుగు సినిమాను దిగంతాలకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ తో ఏకంగాతెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలియడంతోపాటు రాజమౌళి పేరు కూడా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది.
ఈ దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి ఒక యాడ్ లో నటించారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. తన కెరీర్ లో అన్నీ సూపర్ హిట్ సినిమాలనే తెరకెక్కించిన రాజమౌళి ఇంతవరకు ఎలాంటి యాడ్స్ చేయలేదు. మొదటిసారి ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం యాడ్ లో నటించారు. ఈ ప్రకటనకు సంబంధించిన షూటింగ్ అంతా రాజస్థాన్ లో చేశారు.

కుటుంబంతో కలిసి వెళ్లిన రాజమౌళి ఆక్కడ యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ను కూడా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక సినిమా చేసినందుకు రాజమౌళి దాదాపు రూ.150 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తుంటాయి. యాడ్ చేసినందుకు కూడా ఆ స్థాయిలోనే రమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క యాడ్ కు రూ.3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే టీవీల్లో వచ్చిన ఈ మొబైల్ కంపెనీ యాడ్ అందరినీ ఆకట్టుకుంది. సినిమా హీరోలకు ధీటుగా రాజమౌళి ఉన్నారంటూ వ్యాఖ్యలు వచ్చాయి. మహేష్ బాబుతో రూపొందించబోయే చిత్రాన్ని సూపర్ స్టార్ పుట్టినరోజునాడు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ కూడా అందుకు సపోర్ట్ చేస్తోందని రచయిత విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications