హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు రికార్డ్! సచివాలయంకు భారీ 'పునాది' (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విజయవాడ: లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, కేవలం 125 రోజుల్లో నిర్మించిన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లకి మంత్రులు, ఉద్యోగులు బుధవారం నాడు మధ్యాహ్నం గం.2.59 నిమిషాలకు అడుగు పెట్టారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి వందలమంది ఉద్యోగులు తరలి వెళ్లారు.

సచివాలయ నిర్మాణం బాధ్యతను ప్రభుత్వం ఓ నిర్మాణ సంస్థకు అప్పగించింది. దాంతోనే వదిలివేయకుండా ఎప్పటికి అప్పుడు ప్రభుత్వం ఆ కంపెనీ వెంట పడింది. అలాగే, ప్రభుత్వం తరఫున అధికారులు బాధ్యతలు కూడా తీసుకున్నారు.

లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం ఉంది. 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కింది అంతస్తు, అన్ని వసతులు, పకడ్బందీగా నిర్మాణం జరిగింది. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ, అడ్డంకులను అధిగమిస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిపాలన ఆనందోత్సాహాల మధ్య బుధవారం ప్రారంభమైంది.

వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల మధ్య వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్‌ టక్కర్‌ ప్రారంభించారు.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

నవ్యాంధ్రలో పాలనకు తాత్కాలిక సచివాలయ భవనంలోనే లాంఛనంగా తొలి అడుగు పడుతోంది. ఇది ఏపీకి తొలి కీలక ఘట్టం. కొన్ని పనులు మినహా... నిర్మాణం దాదాపుగా పూర్తయింది.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

ఇంత తక్కువ సమయంలో వేగంగా పనులు పూర్తి కావడం వెనుక భారీ కసరత్తు జరిగింది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం... సవాలుగా స్వీకరించిన నిర్మాణ సంస్థ... నిర్మాణ యజ్ఞం నిరాటంకంగా, యుద్ధ ప్రాతిపదికన సాగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంవల్లే సాధ్యమైంది.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వారం తర్వాత, అంటే, ఫిబ్రవరి 24న అసలు పనులు మొదలయ్యాయి. ఈ నిర్మాణాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేపట్టగా... సీపీ కుక్రేజా, ఫీడ్‌బ్యాక్‌ ఇన్‌ఫ్రా సంస్థలు కన్సల్టెంట్లుగా వ్యవహరించాయి.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

నల్లరేగడి నేలల్లో నిర్మాణం ఇతర నేలలతో పోల్చితే కాస్తంత సంక్లిష్టం. దీనికి అనుగుణంగా నిర్మాణ ప్రణాళికలు రచించారు. భవనానికి పునాదులను పటిష్ఠంగా వేశారు. ఒక్కో భవనానికి 300పైగా పైల్‌ వేశారు. ఒక్కో పైల్‌ను వంద అడుగుల లోతున ఆధునిక యంత్రాలతో బోర్లు తీశారు.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

మూడు పైల్స్‌ను కలిపి భూమట్టంపై కత్తిరించి, అక్కడి నుంచి పిల్లర్లు వేశారు. పీటీ బీమ్స్‌ను ప్రిఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో తయారు చేయించి, వాటిని భారీ శానీ క్రేన్లతో నిలబెడుతూ కేవలం 2 రోజుల్లో ఒక్కొక్క శ్లాబ్‌ను వేయగలిగారు. మనుషులు వేస్తే ఎన్నో రోజులు పట్టే పెయింటింగ్‌ పనులను మెషీన్ల సాయంతో అదీ 5 కోటింగ్‌లను కొద్ది రోజుల్లోనే వేశారు.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

అంతర్గత పనుల్లో భాగమైన ఎంఈపీ (మెకానికల్‌, ఎలకి్ట్రకల్‌, ప్లంబింగ్‌) సంబంధిత పనులకు కనీసం 4 నెలలైనా అవసరం కాగా ప్రత్యేక ప్రణాళికతో 10 నుంచి 15 రోజుల్లోనే పూర్తి చేసేశారు. గదుల నిర్మాణానికి తేలికపాటి బ్రిక్స్‌ను తెప్పించారు. వాటితోనే గదుల నిర్మాణానికి పార్టిషన గోడలను నిర్మించారు.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

అంతస్తుకు పిల్లర్‌ 13 అడుగుల ఎత్తు వేశారు. భవనం లోపల 12 అడుగుల ఎత్తు ఉండేలా నిర్మించారు. ఈ భవనం సివిల్‌ పనులకు ఎల్‌ అండ్‌టీ సంస్థ 400 మందిని సిబ్బందిని వినియోగించింది.

తాత్కాలిక సచివాలయం

తాత్కాలిక సచివాలయం

అత్యధునాతన ఫైర్‌ డిటెక్షన, ఫైర్‌ ఫైటింగ్‌ (స్ర్పింక్లర్ల ద్వారా), ప్రత్యేక ఫైర్‌ స్టెయిర్‌ కేస్‌ నిర్మాణం వంటి ఏర్పాట్లనూ పకడ్బందీగా చేశారు. సెంట్రలైజ్డ్‌ ఏసీ, టాయ్‌లెట్లు, లైటింగ్‌, ఇండోర్‌ సబ్‌స్టేషన, తాగునీటి సరఫరా, డ్రైనేజీ ఇత్యాది సౌకర్యాలనూ కల్పించారు. ఈ కాంప్లెక్స్‌కు దారి తీసే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంతోపాటు ఇతర అనుసంధాన రహదారులు, అంతర్గత రోడ్లను వాయువేగంతో చేపట్టారు.

ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు

తొలివిడతగా గృహనిర్మాణ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ, కార్మిక, వైద్య ఆరోగ్య శాఖలు సచివాలయంలో కొలువయ్యాయి.

ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు

ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ నుంచి 200 మంది సచివాలయ ఉద్యోగులు ఐదు బస్సుల్లో తరలివచ్చారు.

ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు

వీరికి తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి వద్ద ఘన స్వాగతం లభించింది. స్థానిక టిడిపి నేతలతోపాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, రైతులు ఉద్యోగులకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు

ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు

కార్పొరేట్‌ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న సదుపాయాలను చూసి ఉద్యోగులు తాత్కాలిక సచివాలయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు

సచివాలయానికి వెళ్లే మార్గం పూర్తిగా బురదమయంగా ఉండటంతో ఉద్యోగులు అక్కడికి చేరడానికి ఇబ్బంది పడ్డారు.

ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు

సచివాలయానికి వెళ్లే మార్గం పూర్తిగా బురదమయంగా ఉండటంతో ఉద్యోగులు అక్కడికి చేరడానికి ఇబ్బంది పడ్డారు.

English summary
Marking a 'historic' occasion, four departments of Andhra Pradesh today formally moved into the New Government Transitional Headquarters (GTH) -- also called the temporary Secretariat -- at Velagapudi village in the state capital region Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X