జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో బొబ్బిలి జవాన్ మృతి

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వారాలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లు, ఒక ఉగ్రవాది హతమమైనట్లు భద్రతాధికారులు ధృవీకరించారు. మరణించిన నలుగురి జవాన్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ బొత్త సత్యంగా గుర్తించారు.

విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొత్త సత్యం(36) సరిహద్దు భద్రతా దళంలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఉగ్ర దాడిలో మరణించాడని, కుటుంబ సభ్యులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది.

 4 Armymen Killed in Gunbattle With Terrorists in Jammu and Kashmir

సత్యం మరణవార్తను కుటుంబ సభ్యులకు ఈ మధ్యాహ్నం తెలియగానే తీవ్రంగా రోదిస్తున్నారు. బొత్త సత్యంకు బొబ్బిలికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యం మృతదేహం మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి వస్తుందని ఆర్మీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+