త్వరలో మరో 4 వందేభారత్ రైళ్లు ప్రారంభం; ఈసారి తెలుగు రాష్ట్రాలకు నిరాశేనా!!
జులై చివరి వారంలో భారతీయ రైల్వే నలుగు కొత్త వందే భారత్ రైలు మార్గాలను ప్రవేశపెట్టాలని రెడీ అవుతుంది. దేశంలో కొత్తగా మరో నాలుగు వందే భారత్ రైళ్ళు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలాఖరులోనే వీటిని ప్రారంభించడానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే తెలుగురాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు వస్తుందని భావిస్తే ఈ సారి నిరాశే కనిపిస్తుంది.
వందే భారత్ రైళ్లపై విమర్శలు వస్తున్నా,వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు కొనసాగుతున్నా వందే భారత్ రైళ్ళ విషయంలో మాత్రం రైల్వేశాఖ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ, ఇప్పుడు మరో నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ నాలుగు రైళ్లు ఎనిమిది కోచ్ లతో నడవనున్నాయి. వీటిలో ఏడు చైర్ కార్ లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లు ఉండనున్నాయి. ఇందులో ఢిల్లీ చండీగఢ్, చెన్నై తిరునల్వేలి, లక్నో ప్రయాగ్ రాజ్, గ్వాలియర్ భోపాల్ రైళ్ళు ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు రైళ్ళ తో కలిపి మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది.
ఈ నెలలో ప్రారంభించనున్న ఈ నాలుగు రైళ్లలో ఒక్కొక్క దానిలో 556 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలు ఉంటుంది. ఢిల్లీ చండీగఢ్ రూట్ లో ఇప్పటికే చాలా రైళ్ళు ఉన్నప్పటికీ, ప్రయాణికుల నుండి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ రూట్లో వందే భారత్ ట్రైను ను తీసుకు వస్తున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ప్రయాగ్ రాజ్ వందే భారత్ తో రాష్ట్రంలో వందే భారత్ రైళ్ల సంఖ్య మూడుకు చేరనుంది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్వాలియర్- భోపాల్ మధ్య వందే భారత్ రైలు ను తీసుకు వస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలలో చెన్నై- తిరుపతి లేదా చెన్నై- విజయవాడ మధ్య వందే భారత్ రైలు ప్రచారం జరిగినా ఇక అది మాత్రం ఇప్పట్లో లేదని తెలుస్తుంది. చెన్నై తిరునల్వేలి మధ్య వందే భారత్ రైలు తీసుకురావడంతో ఈ దఫాలో తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు లేనట్టేనని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications