హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బావిలో పడిన చిన్నారి, ఘటనా స్దలానికి మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

 4 Year Old Girl Fall Down well in Manchala, Rangareddy
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల గిరిజ బాలిక బోరుబావిలో పడింది. సహాయం కోసం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

దీంతో సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు బాలికను రక్షించేందుకు గాను పొక్లెయిన్ సహాయంతో బావికి సమాంతరంగా గుంతను తవ్వతున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి సంఘటనా స్దలానికి చేరుకుని... బాలికను రక్షించే పనులపై సమీక్షిస్తున్నారు. ఈ ఘటనకు విచారణ జరిపించి, బాధ్యులను శిక్షిస్తామన్నారు.

బాలికను కాపాడేందుకు ఆక్సిజన్ లోపలికి పంపిస్తున్నారు. బావి సుమారుగా 300అడుగులు ఉండటంతో బాలిక బోరులో ఇరుక్కుని ఉందని అధికారులు తెలిపారు. బోరుబావిలో నీళ్లు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు.

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
నల్గొండ జిల్లాలోని చిలుకూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యను భర్త కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మెట్రో పొలిస్ కమాను కూలి ఒకరు మృతి
మాదాపూర్‌లో మెట్రోపొలిస్ కమాను కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిని వ్యక్తిని ఆసుపత్రికి తరించిన చికిత్స అందిస్తున్నారు.

అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనలు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం శబ్దిపూర్‌లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా తాళమడుగు మండలం నందిగామలో పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

English summary
5 Year Old Girl Fall Down well in Manchala, Rangareddy District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X