ఏపీలో భారీగా కరోనా కొత్త కేసులు: తూర్పుగోదావరి, కృష్ణాలో అత్యధికం, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 33,634 నమూనాలను పరీక్షించగా.. 492 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,94,536కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో భారీగా పెరిగిన కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లోనూ

ఏపీలో భారీగా పెరిగిన కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లోనూ

గత 24 గంటల్లో కరోనా బారినపడి విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7193 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 256 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,84,727కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2616 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు..

ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు..

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,48,05,335 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 29, చిత్తూరులో 56, తూర్పుగోదావరిలో 168, గుంటూరులో 47, కడపలో 5, కృష్ణాలో 63, కర్నూలులో 20, నెల్లూరులో 22, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 46,

విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Telangana లో కరోనా దడ.. స్కూళ్లు మూసివేత దిశగా అడుగులు!!
    దేశ వ్యాప్తంగా కాస్త తగ్గినా...

    దేశ వ్యాప్తంగా కాస్త తగ్గినా...

    దేశ వ్యాప్తంగానూ కరోనా కేసుల్లో ఉధృతి కొనసాగుతున్నప్పటికీ.. సోమవారం కాస్త కేసులు తగ్గాయి. సోమవారం ఆదివారం 46,951 కొత్త కేసులు నమోదు కాగా, సోమవారం 40,715 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796కి చేరింది. కొత్తగా 29,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.11 కోట్లకుపైబడింది. గత 24 గంటల్లో 199 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1.6లక్షలకి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,45,377 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 2 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ఇక మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 32,53,095 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 4,84,94,594కి చేరింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+