ఏపీలో కొత్తగా 500కుపైగా కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, విజయనగరంలో అత్యల్పం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఏపీలో గత 24 గంటల్లో ఐదు వందలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 600కుపైగా కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు బాగా పెరిగాయి.

ఏపీలో కొత్తగా 506 కరోనా కేసులు, ఐదుగురు మృతి
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 506 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇక కరోనా బారినపడి ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,75,531కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి 7057 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో 5వేల దిగువకు యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 613 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,63,508కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,08,30,99 కరోనా నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.

ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులు
చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 12, చిత్తూరులో 64, తూర్పుగోదావరిలో 12, గుంటూరులో 39, కడపలో 8, కృష్ణాలో 49, కర్నూలులో 17, నెల్లూరులో 26, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 17, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 43 నమోదయ్యాయి.
Recommended Video

దేశంలో పెరుగుతున్న రికవరీ..
ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 10,14,434 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 30,254 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కి చేరింది. గత 24 గంటల్లో 391 మంది మరణించగా, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,43,019కి చేరింది. ఒక్కరోజే 33,136 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,56,546 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 94.93 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications