ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా: కొత్త కేసుల కంటే, కోలుకున్నవారే ఎక్కువ, జిల్లాల వారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు ఎక్కువగా చేసినప్పటికీ.. కొత్త కరోనా కేసులు మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. అంతేగాక, రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఏపీలో కొత్తగా 5210 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 5210 కరోనా కేసులు


గత 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75,517 నమూనాలను పరీక్షించగా 5210 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 30 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా మరణాలు..

జిల్లాల వారీగా మరణాలు..

జిల్లాల వారీగా మరణాల సంఖ్యను గమనించినట్లయితే.. ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, అనంతపురం, కృష్ణాలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 6224కి చేరింది.

ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 165, చిత్తూరులో 412, తూర్పుగోదావరిలో 208, గుంటూరులో 348, కడపలో 174, కృష్ణాలో 388, కర్నూలులో 124, నెల్లూరులో 219, ప్రకాశంలో 230, శ్రీకాకుళంలో165, విశాఖపట్నంలో 96, విజయనగరంలో 90, పశ్చిమగోదావరిలో 327 కేసులు నమోదయ్యాయి.

కోలుకుంటున్న ఏపీ..

కోలుకుంటున్న ఏపీ..

గత 24 గంటల్లో 5509 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 7,00,313కు చేరింది. ప్రస్తుతం 46,295 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 65,69,616 నమూనాలను పరీక్షించారు. దేశ వ్యాప్తంగా అత్యధిక కేసులున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఏపీనే ఉంది. యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మాత్రం నాల్గవ స్థానంలో ఉంది. కాగా, దేశ వ్యాప్తంగా 70 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షకుపైగా మరణాలు సంభవించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+