బాలుడిపై కామాంధుడి లైంగిక దాడి: భర్తపై కోపంతో పిల్లలతో తల్లి ఆత్మహత్య

ఒంగోలు: ఏడేళ్ల బాలుడిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం మండలంలో సోమవారంనాడు జరిగింది. మండలంలోని తురిమెళ్లలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఆదే గ్రామానికి చెందిన రవీంద్ర (19) అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలుడు కేకలు వేయడంతో ఆ విషయం వెలుగు చూసింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదిలావుంటే, భర్తతో తలెత్తిన వివాదంతో మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి, తనపై కూడా పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తూర మండలం దిమిలి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

7 years old boy sexually assaulted

మృతులను కెల్ల భాగ్యం (35), ఆమె కూతురు నాగమణి (5), కుమారుడు మోహనరావు (2 నెలలు) ప్రాణాలు కోల్పోయారు. దిమిలి గ్రామానికి చెందిన కెల్ల పార్వతీశానికి మగ పిల్లలు లేకపోవడంోత మొదటి భార్య చెల్లెలు భాగ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు.

భాగ్యం వద్ద పెట్టిన రూ.15వేలపై భర్త వివాదానికి దిగాడు. దీనిపై కొద్ది రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా వారు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన భాగ్యం ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన పిల్లలపై కిరోసిన్ పోసి, తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంచింటింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+