రైల్వే టిక్కెట్లపై 75 శాతం డిస్కౌంట్
భారతీయ రైల్వేల్లో ప్రయాణం చేసేవారికి మంచి శుభవార్త. రాబోయే రోజుల్లో రైలులో ప్రయాణం చేయాలని భావిస్తున్నట్లయితే కొందరు వ్యక్తులకు టికెట్లపై తగ్గింపు ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో నాలుగో స్థానంలో భారత్ ఉంది. ప్రతిరోజు నాలుగు కోట్ల మంది రైల్వేలద్వారా ప్రయాణం చేస్తున్నారు. వివిధరకాలవారికి, వివిధ వర్గాలవారికి టికెట్లలో తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తోంది.
దివ్యాంగులకు, దృష్టిలోపం ఉన్నవారికి, బుద్ధిమాంద్యం ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. సాధారణ తరగతి నుంచి స్లీపర్, థర్డ్ ఏసీ వరకు టిక్కెట్లపై 75 శాతం రాయితీని పొందుతారు. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటే 50 శాతం తగ్గింపు పొందుతారు. అదే సమయంలో, రాజధాని, శతాబ్ది వంటి రైళ్లకు 25 శాతం వరకు తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. మాట్లాడలేని, వినలేని వారికి రైలులో 50 శాతం తగ్గింపు ఉంది. అలాంటి వ్యక్తులతో ప్రయాణించే ఎస్కార్ట్ కు కూడా టిక్కెట్లపై అదే తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు.. క్యాన్సర్, తలసేమియా, హృద్రోగులు, కిడ్నీ రోగులు, హిమోఫిలియా రోగులు, TB రోగులు, AIDS రోగులు, ఆస్టమీ రోగులు, రక్తహీనత, అప్లాస్టిక్ అనీమియా రోగులకు కూడా తగ్గింపు తగ్గింపు ప్రయోజనం వర్తిస్తుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృష్టిచేస్తోంది. ఇందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. ఈ రైళ్లల్లో ప్రయాణించే దివ్యాంగులుకు, రోగులకు రాయితీని వర్తింపచేయడంలేదు. దీనిపై రైల్వే బోర్డును, కేంద్ర రైల్వే మంత్రిని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ వందే భారత్ రైళ్లకు మాత్రం రాయితీని వర్తింపచేయలేమని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications