ఏపీలో కొత్తగా 10వేల దిగువకు కరోనా కేసులు: లక్షా23వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..

Recommended Video

    TOP NEWS : Donald Trump On China Over COVID19 | Oneindia Telugu

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 10వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేగాక, కరోనా మహమ్మారితో మరణించినవారి సంఖ్య కూడా వందకు దిగువనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 83,690 నమూనాలను పరీక్షించగా.. 8976 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

    ఏపీలో కొత్తగా 8976 కరోనా కేసులు, 90 మరణాలు

    ఏపీలో కొత్తగా 8976 కరోనా కేసులు, 90 మరణాలు

    తాజాగా నమోదైన 8976 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,58,339కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 90 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, పశ్చిమగోదావరిలో 9 మంది, అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఎనిమిది మంది చొప్పున, ప్రకాశంలో ఏడుగురు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 11,466కు చేరింది.

    ఏపీలో రికవరీలు పెరగడంతో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

    ఏపీలో రికవరీలు పెరగడంతో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

    ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 13,568 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,23,447కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,23,426 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,97,91,721 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1669 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 298 మంది కరోనా బారినపడ్డారు.

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 995, చిత్తూరులో 1232, తూర్పుగోదావరిలో 1669, గుంటూరులో 578, కడపలో 523, కృష్ణాలో 726, కర్నూలులో 361, నెల్లూరులో 396, ప్రకాశంలో 506, శ్రీకాకుళంలో 381, విశాఖపట్నంలో 700, విజయనగరంలో 298, పశ్చిమగోదావరిలో 611 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది. మరోవైపు నేటి నుంచి నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+