ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, తూర్పుగోదావరిలో అత్యధిక కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 56,463 నమూనాలను పరీక్షించగా.. 809 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు, 10 మంది మృతి

ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు, 10 మంది మృతి

తాజాగా నమోదైన 809 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,51,133కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళంలో ఒక్కరు కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,186కి పెరిగింది.

ఏపీలో 11,142 యాక్టివ్ కేసులు

ఏపీలో 11,142 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1160 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,25,805కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 11,142 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,83,50,167 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 05, చిత్తూరులో 153, తూర్పుగోదావరిలో 161, గుంటూరులో 78, కడపలో 16, కృష్ణాలో 54, కర్నూలులో 02, నెల్లూరులో 115, ప్రకాశంలో 83, శ్రీకాకుళంలో 09, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 01, పశ్చిమగోదావరిలో 93 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,91,472, చిత్తూరులో 2,44,079 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,763) కరోనా కేసులున్నాయి.

దేశంలో పెరిగిన కరోనా కేసులు

దేశంలో పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,20 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,727 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.37 కోట్ల చేరింది. గురువారం 277 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,48,339కి చేరింది. గురువారం 28,246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.30కోట్లకు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.86 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,75,224 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.82 శాతానికి తగ్గింది. గురువారంనాడు 64.40 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 89.02 కోట్లకు చేరింది. మరోవైపు కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గురువారం కేరళలో దేశంలో సగానికిపైగా అంటే 15,914 కొత్త కేసులు నమోదు కాగా, 122 మరణాలు సంభవించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+