ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు: వెయ్యికి చేరువలో యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కొత్తగా 33,876 నమూనాలను పరీక్షించగా.. 97 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,275కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

కృష్ణా జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటి రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 7158కి చేరింది. గత 24 గంటల్లో 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,80,046కు చేరింది. ఇప్పటి వరకు 1,32,76,678 కరోనా నమూనాలను పరీక్షించారు.

 97 new corona cases reported in andhra pradesh: one death in last 24 hours

ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 6, చిత్తూరులో 25, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 7, కడపలో 6, కృష్ణాలో 11, కర్నూలులో 1, నెల్లూరులో 7, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 5, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 1071 యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24గంటల్లో 7,15,776 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,408 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591కి చేరింది. తాజాగా, 15,853 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1.04కు చేరింది. కరోనా బారినపడి తాజాగా 120 మంది మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,54, 823కి చేరింది.

కాగా, నిన్నటి వరకు దేశంలో 19.99 కోట్ల కరోనా నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం దేశంలో 1,51,460 యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+