కాలిఫోర్నియా నదిలో ఏపీ యువకుడు గల్లంతు
కాలిఫోర్నియా/విజయవాడ: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ నదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా యువకుడు గల్లంతయ్యారు. జగ్గయ్యపేట మండలం బండిపాలెం వాసి పుట్టా నరేశ్(24) అక్కడి లివర్‌మోర్ నదిలో స్నేహితులతో కలిసి పడవలో షికారుకు వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు.
స్నేహితులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారమందించడంతో వారు నరేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, బండిపాలెంకు చెందిన నరేష్.. రెండేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి బోటు షికారుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా బోటు పల్టీ కొట్టడంతో నరేష్ గల్లంతయ్యారు.
స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న నరేష్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడిని వెతికిపెట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications