ధూమ్ ఫిల్మ్‌లో లాగే, సినిమాల్లో డూప్: చోరీలతో కటకటాల పాలు

హైదరాబాద్: ధూమ్ సినిమాలో హీరోలా డూప్‌గా నటించిన ఓ వ్యక్తి జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచర్‌గా మారి కటకటాలపాలైన సంఘటన హైదరాబాదులోని అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బైక్ రేసులో సంచలనం సృష్టించిన ఆ వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు. ముంబైకి చెందిన నషీంషేక్ కుమారుడు ఇబ్రహింషేక్(37) వాహనాలకు రేడియం నంబర్ ప్లేట్లను అమరుస్తూ జీవనం సాగిస్తున్నాడు.

తాను డిగ్రీ చదివే సమయంలో నేర్చుకున్న బైక్ రేసింగ్‌లతో సినిమాల్లో కనిపించే ఫీట్లను తలదన్నే రీతిలో స్టంట్లు చేయడంతో ధూమ్ సినిమా హీరోలకు డూప్‌గా నటించాడు. కాగా, వ్యసనాలకు అలవాటు పడడంతో వచ్చే డబ్బు సరిపోక, సినిమాల్లో అవకాశాలు లేక దొంగగా మారాడు. 2009 నుంచి 2012 వరకు వాహనాలు, మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దొంగిలిస్తూ చైన్‌స్నాచర్‌గా మారాడు. అక్కడి పోలీసులు పట్టుకుని జైల్‌కు పంపించారు.

A boy arrested for chain snatching like in Dhoom film

జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం హైదరాబాద్‌లోని సుల్తాన్‌షాహిలో అత్తగారి ఇంటి వద్ద భార్య పిల్లలతో స్థిరపడ్డాడు. కింగ్‌కోఠిలోని రేడియం షాపులో పని చేస్తున్నాడు. తన బుద్ధిని మార్చుకోని ఇబ్రహీం షేక్ నగరంలోని అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నారాయణగూడ, సైఫాబాద్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. తాజాగా జంగల్‌విఠోభా ఆలయం సమీపంలో ఓ మహిళ మెడలోని గొలుసును దొంగిలించే క్రమంలో స్థానికులు గమనించి పట్టుకునేందుకు యత్నించారు.

కానీ అతడు తన బైక్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోని దిగిన క్రైం పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. సోమవారం సీబీఎస్ సమీపంలో డబ్బు, బంగారు నగలతో అనుమానాస్పదంగా తిరుగుతుండా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాలను ఒప్పుకోవడంతో అతడి నుంచి 21 తులాల అభరణాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. డీఎస్‌ఐ కె.కరుణకుమార్, ఎస్సై చంద్రశేఖర్‌యాదవ్ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+