Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగాళాఖాతంలో బలహీన పడ్డ అల్పపీడనం- అయినా

Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై భారత వాతావరణ కేంద్రం అప్‌డేట్ ఇచ్చింది. ఇది బలహీనపడిందని వెల్లడించింది. అయినప్పటికీ- నేడు, రేపు ఉత్తరాంధ్ర, ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో నైరుతి దిశగా పశ్చిమ- మధ్య ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి 11:30 గంటల సమయానికి విశాఖపట్నానికి దక్షిణ- ఆగ్నేయ దిశగా 430, చెన్నైకి ఆగ్నేయ దిశగా 490, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు- ఈశాన్య దిశగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

A Depression area over the Bay of Bengal weaken thereafter over the Sea says IMD

క్రమంగా ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని ఈ సాయంత్రానికి మరింత బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. నేడు ఈ ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.

దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉండొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ అల్పపీడనం వల్ల నేడు శ్రీకాకుళం, విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిస్తాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది.

ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు. శని, ఆదివారాల్లో తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంపైకి చేపల వేటకు వెళ్లకూడదని ఐఎండీ సూచించింది.

ఈ నెల 23వ తేదీ ఉదయం వరకు తీర ప్రాంతంలో 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దీని తీవ్రత 65 కిలో మీటర్ల వరకూ పెరిగే అవకాశం ఉంది. ఒడిశా దక్షిణ ప్రాంతం నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+