వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాచిపోయిన భోజనం,నీళ్ళు కూడా ఇవ్వకుండా .. ఏపీలో కరోనా చికిత్సపై ఓ డిప్యూటీ తహసీల్దార్ ఆవేదన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది. ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నామని, ఆసుపత్రులలో వసతుల లేమి లేదని చెప్పిన ఏపీ సర్కార్ కు డిప్యూటీ తహసిల్దార్ వీడియో షాక్ ఇచ్చింది. ఆసుపత్రులలో వసతుల లేమి,డాక్టర్లు పట్టించుకోకపోవడం, కనీసం సమయానికి రోగులకు భోజనం కూడా అందించడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఏపీలోని ఆ ఏడు జిల్లాల్లో కరోనా కల్లోలం.. వెల్లడించిన కేంద్రం, ఆ వేరియంట్ తో వణుకుతున్న జనం !!ఏపీలోని ఆ ఏడు జిల్లాల్లో కరోనా కల్లోలం.. వెల్లడించిన కేంద్రం, ఆ వేరియంట్ తో వణుకుతున్న జనం !!

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చేరిన డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చేరిన డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ

కరోనా మహమ్మారి బారిన పడిన రోగులు ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు కట్టినా సరైన వైద్య సహాయం అందడం లేదని వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ తాను అనుభవించిన బాధను సెల్ఫీ వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల క్రితం వజ్రపు కొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణకు, ఆయన తల్లి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారిద్దరూ చేరారు. ఆసుపత్రిలో డబ్బులు కట్టి చేరినా కూడా తమకు కనీసం వైద్యం కూడా చేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.

పాచిపోయిన భోజనం పెడుతున్నారు, మంచి నీళ్ళ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు అంటూ వీడియో

పాచిపోయిన భోజనం పెడుతున్నారు, మంచి నీళ్ళ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు అంటూ వీడియో

తన తల్లికి కనీసం సెలైన్ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్ల కోసం పదేపదే అడుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని డిప్యూటీ తహసీల్దార్ తన బాధను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పాచిపోయిన భోజనాన్ని రోగులకు అందిస్తున్నారని, భోజనం కూడా పదే పదే అడిగితేనే పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక అర్ధరాత్రి 12 గంటలకు భోజనం పెడుతున్నారని పేర్కొన్నారు.ఆసుపత్రులలో దారుణంగా మారిన పరిస్థితులపై వీడియో సందేశాన్ని పంపిన మురళీకృష్ణ, తన సందేశాన్ని స్థానిక మీడియాకు పంపించారు.

 వైరల్ గా వీడియో .. జగన్ సర్కార్ కరోనా బాధితుల ఆవేదనపై ఏమంటారో?

వైరల్ గా వీడియో .. జగన్ సర్కార్ కరోనా బాధితుల ఆవేదనపై ఏమంటారో?

దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. డబ్బులు కట్టినా కూడా ప్రైవేట్ ఆసుపత్రులలో సరైన వైద్యం అందడం లేదని, తనలాంటి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మురళీకృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రులలో కరోనారోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్న జగన్ సర్కార్ కరోనా బాధితుల ఆవేదనపై ఏమంటారో తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది .

Recommended Video

Ys Jagan సర్కారుకి హైకోర్టు సూచన, లోపాలు ఉన్నాయ్ చూస్కోండి
ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనలో జగన్ సర్కార్ ఫెయిల్

ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనలో జగన్ సర్కార్ ఫెయిల్

ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న కరోనా రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా జగన్ సర్కార్ ఫెయిల్ అయిందని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది.ఇలాంటి పరిస్థితులు ఆస్పత్రులలో ఉంటే, చాలామంది కరోనా బాధితులు ఆసుపత్రులకు వెళితే ఆర్థిక స్తోమత లేక, ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేక కరోనా మహమ్మారికి బలైపోతున్నారు.కరోనా సెకండ్ వేవ్ లో సామాన్యులే ఎక్కువశాతం బలైపోతుండడం గమనార్హం.

English summary
Vajrapukottur Deputy Tehsildar Muralikrishna took a selfie video of himself suffering from corona pandemic patients who did not receive proper medical care despite spending money in private hospitals. The deputy tehsildar expressed his grief that the hospital staff did not care despite repeated requests for water. At the same time, he alleged that rotten meals were being served to patients and that meals were also being offered if asked repeatedly. The video of Murali Krishna sending a video message on the deteriorating conditions in the hospitals has now gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X