ఘోరం: పాఠశాలకెళ్లలేదని కూతుర్ని కొట్టిచంపిన తండ్రి

పశ్చిమగోదావరి: జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బడికెళ్లలేదనే కోపంతో కూతర్ని కన్న తండ్రే తీవ్రంగా చితకబాదాడు. దీంతో ఆ చిన్నారి చెంది. సెప్టెంబర్ 22న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 22న బడికి వెళ్లలేదని ఆరో తరగతి చదువుతున్న 12ఏళ్ల కుమార్తెను తండ్రి చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కుమార్తె మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టాడు తండ్రి. కుమార్తె తల్లి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

A father allegedly killed his daughter

ఘోర ప్రమాదం: తల్లీకొడుకు మృతి, 25మందికి గాయాలు

రోడ్డుపై ఆగి ఉన్న ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం గ్రామ శివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం .. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి వెళుతున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల చీకటిగూడెం శివారులో డ్రైవర్‌ రోడ్డు వెంట నిలిపాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనలో లారీలో ప్రయాణిస్తున్న కృష్ణా జిల్లా వీర్లపహాడ్‌ మండలం పొన్నవరం గ్రామానికి చెందిన ముత్తవరపు వెంకటేశ్వర్‌రావు(40), అతని తల్లి ముత్తవరపు రుక్మిణమ్మ(58) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో మృతదేహాలు ఛిద్రమైపోయాయి. వెంకటేశ్వర్‌రావు హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పని చేస్తుండగా అతని భార్య, తల్లి కూలీ పని చేస్తున్నారు. వీరు తమ స్వస్థలంలో నూతనంగా రేషను కార్డులు తీసుకునేందుకు సొంత వూరికి వెళుతున్నారు.

ప్రమాదంలో మృతుడి భార్య ముత్తవరపు నాగలక్ష్మి, లారీ డ్రైవర్‌ వి.శ్రీనివాస్‌, ప్రయాణికుడు ఏర్పుల బాలస్వామి తీవ్రంగా గాయపడ్డారు. లారీ వేగానికి బస్సు రోడ్డుపక్కన గోతిలోకి బోల్తాపడింది. బస్సులోఉన్న 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+