మూగ యువతిపై ఐదుగురు దుండగుల గ్యాంగ్‌రేప్: పరిస్థితి విషమం
వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఐనవోలులో దారుణం చోటుచేసుకుంది. ఓ మూగయువతిపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిని వెంబడించిన దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.
అనంతరం చెట్టుకు కట్టేసి పరారైయ్యారు. ఈ అమానుష ఘటనలో యువతి సృహకోల్పోయింది. యువతిని గుర్తించిన కొందరు చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బాలికను వేధించిన కేసులో నిందితుడి అరెస్ట్
బాలికను వేధించిన కేసులో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు హసన్‌పర్తి ఎస్ఐ పి దయాకర్ తెలిపారు. హన్మకొండ మండలం పైడిపల్లి పరిధిలోని పాలిటెక్నిక్ చదువుతున్న బాలిక(16)ను శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన చెందిన అంకేశ్వరపు కొమ్మాలు(36) ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.
అంతేగాక పలుమార్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని బుధవారం అరెస్ట్ చేశారు. కోర్టుకు రిమాండ్ పంపించినట్లు తెలిపారు.
విద్యుత్ ఘాతంతో విద్యార్థి మృతి
పరకాల పట్టణంలో బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన బొచ్చు అఖిల్(21) ఎస్వీ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాదవశాత్తు వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. తలకు బలమైన గాయాలవగా వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అఖిల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications