బైక్ నుంచి దూకేసి యువతి మృతి: ప్రియుడు నోరు విప్పితేనే..!

తన స్నేహితుడి బైక్ మీద వెళుతూ హఠాత్తుగా దూకేసింది ఓ యువతి. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో చోటు చేసుకుందీ ఘటన.

శ్రీకాకుళం: తన స్నేహితుడి బైక్ మీద వెళుతూ హఠాత్తుగా దూకేసింది ఓ యువతి. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో చోటు చేసుకుందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంత బొమ్మాళి మూలపేట గ్రామానికి చెందిన జీరు రాజేశ్వరి(యర్రమ్మ) టెక్కలిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె దసరా సెలవులకు ఇంటికి వచ్చింది.

A girl died after jumping from her lover's bike in Srikakulam district.

కళాశాలలో ఫీజు కట్టాలని ఇంటి వద్ద చెప్పి సోమవారం టెక్కలి వచ్చింది. టెక్కలిలో తనతో సన్నిహితంగా ఉండే సంత బొమ్మాళి మండలం యామలపేటకు చెందిన రఘువు వినోద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లింది.

అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ.. లింగాలవలస కాలనీ వచ్చేసరికి ఒక్కసారిగా బైక్‌పై నుంచి దూకేసింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె మరణవార్త విన్న ఆమె తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

యామలపేటకు చెందిన వినోద్‌తో ప్రేమబంధమే ఆమె మృతి వరకు తీసుకువచ్చిందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వినోద్‌ను టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడు నోరు విప్పితే గానీ, అసలు విషయం తెలిసే అవకాశం లేదు. ఘటనా స్థలానికి వెళ్లిన ఎస్‌ఐ రాజేష్‌ వివరాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నిఏరియా ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+