భర్తను వదిలేసొచ్చిన మహిళ: ప్రియుడితో చేర్చిన జగన్ పార్టీ నేత
కృష్ణా: ఆ యువతి పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించింది. అబ్బాయి తరఫు పెద్దలు వీరి ప్రేమను పెళ్లిగా మార్చేందుకు ఒప్పుకున్నా, అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. ఆ తర్వాత బలవంతంగా ఆ యువతికి మరో యువకుడితో పెళ్లి చేసేశారు.
పెళ్లి కాగానే ప్రియుడిని వదిలేసి భర్తతో అమెరికా వెళ్లిపోయిన ఆ యువతి ప్రియుడిని మాత్రం మరిచిపోలేకపోయింది. తరచూ ప్రియుడితో ఆమె ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఈ క్రమంలో భర్తను వదిలేసి వచ్చేయమన్న ప్రియుడి భరోసాతో భర్తను వదిలేసి అమెరికా నుంచి హైదరబాద్ నగరంలో వాలిన ఆ యువతికి ప్రియుడి అడ్రెస్ కనిపించలేదు. కాగా, పుట్టింటి వారు ఆమెను ఇంటిలోకి అడుగుపెట్టనివ్వలేదు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో అపస్మారక స్థితిలో వెళ్లిన యువతి ఆస్పత్రి పాలైంది. ఈ విషయం తెలిసిన మీడియా మొత్తం తతంగాన్ని బయటపెడ్డటంతో పాటు ఆ యువతిని ప్రియుడి చెంతకు చేర్చేందుకు యత్నించింది. అయితే, సమాచారం అందుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్... సదరు యువతి ప్రియుడిని ఆస్పత్రికి తీసుకొచ్చి మరీ ఆమెతో కలిపారు.
భర్తని కాదని అమెరికా నుంచి ప్రియుడి కోసమొచ్చిన యువతి, సూసైడ్‌యత్నం
కృష్ణా జిల్లా ప్రధాన నగరం విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తాను పెళ్లి చేసుకున్న ప్రభాకర్ ను అమెరికాలో వదిలేసి మానస అనే యువతి హైదరాబాద్, ఆ తర్వాత విజయవాడ వచ్చేసింది. ఇక అందరి యత్నం ఫలించి తన ప్రియుడు హేమంత్ తో మానస జత కలిసింది. దీంతో మానస నిరీక్షణ ముగిసినట్లయింది.












Click it and Unblock the Notifications