ప్రేమ వ్యవహారం?: కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు: జిల్లాలోని బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో గురువారం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా కోవూరుకు చెందిన సాయి తేజస్విని(19) అగ్రికల్చర్ బిఎస్సీ సెకండీయర్ విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
భర్త ఇంటి ఎదుట భార్య మౌన పోరాటం

తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఆమె భర్త ఇంటి ఎదుట మౌన ప్రదర్శన చేస్తోంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినడాలో చోటు చేసుకుంది. తన భర్త వెంకటేశ్వరరావు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని సుజాత ఆరోపించింది.
రైలు కిందపడి వ్యక్తి మృతి
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి(30) రైలు కిందపడి మృతి చెందాడు. తాడిపత్రిలోని ఎల్లనూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతనిది హత్యా, లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications