ప్రేమికుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకొన్న యువతి, క్షమించాలని తల్లికి లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

పిఠాపురం: ప్రేమిస్తున్నానని మోసం చేసినందుకుగాను ఓ యువతి మాతృదినోత్సవం రోజునే పుత్రశోకం కలిగిస్తున్నందుకు తనను క్షమించాలని లేఖరాసి ఓ కూతురు ఆత్మహత్య చేసుకొన్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శాంతినగర్ కు చెందిన బక్కా శ్రీనివాస్ , భవాని దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్దదైన శిరీష చదువులో టాప్. ఐఎఎస్ కావాలనే పట్టుదలో చదివింది. అయితే తన కూతురును కలెక్టర్ ను చేస్తానంటూ ఆమె తల్లిదండ్రులు కూడ ఎప్పుడు చెప్పేవారు.

పిఠాపురం మండలం కోలంకకు చెందిన ఒక పాస్టర్ ఆనంద్ నగర్ లో కొన్నెళ్ళుగా ఓ ప్రార్ధనా మందిరం నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు ఉన్నాడు. అతడి పేరు కన్నా. కన్నాతో శిరీషకు పరిచయం ఏర్పడింది.

A girl suicide for lover cheating in East Godavari district

ఇద్దరూ ప్రేమించుకొన్నారు. కొద్దిరోజులుగా కన్నా ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఫేస్ బుక్ ఖాతాను తొలగించాడు. వాట్సాప్ ను నిలిపివేశాడు. ఫోన్ కు సమాధానం ఇవ్వడం లేదు. ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. అయితే శనివారం నాడు శిరీష కోలంకకు వెళ్ళి కన్నా కుటుంబసభ్యులను అతడి గురించి ఆరా తీసింది.

అయితే తమ కొడుకే కనపించడం లేదు. అయినా మా వాడితో నీకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మర్యాదగా వెళ్ళిపో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పారు.అయితే తాను మోసపోయినట్టు స్థానికులు చెప్పి ఆ యువతి భాధపడిందని స్థానికులు చెప్పారు. అదే గ్రామంలో ఉన్న తన అమ్మమ్మవద్దకు వెళ్ళి అదే రాత్రి అక్కడే ఉంది.

ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంది. అయితే సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆమె కన్పించిందని స్థానకులు చెబుతున్నారు.అయితే తన చావుకు కన్నా తల్లిదండ్రులే కారణమంటూ శిరీష లేఖ రాసింది.అయితే సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మదర్స్ డే రోజునే తాను ఈ నిర్ణయం తీసుకొన్నందుకు తనను క్షమించాలని ఆమె రాసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl suicide for lover cheating in East Godavari district on Sunday.Sireesha cheated by her lover Kanna.she wrote a suicide letter before hanging.
Please Wait while comments are loading...