అమ్మాయిల హాస్టల్లో అర్ధరాత్రి నగ్నంగా దూరాడు!

విజయనగరం: అమ్మాయిల హాస్టల్లో అర్థరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలోని వేణుగోపాలపురం కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల, హైస్కూల్, హాస్టల్ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. కొత్తగా డార్మిటరీ నిర్మాణం జరుగుతోంది. దీంతో కొన్ని కిటికీలు తొలగించి ఉన్నాయి.

సెప్టెంబర్ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు.. తొలగించిన ఓ కిటికీలోంచి ఓ ఆగంతకుడు నగ్నంగా లోపలకు ప్రవేశించాడు. టీచర్స్ డే కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాక్టీస్ చేసిన విద్యార్థులు గాఢ నిద్రలో ఉండటంతో, నెమ్మదిగా అమ్మాయిల పక్కన పడుకుని వారి దుస్తులను కూడా బ్లేడుతో తొలగించాడు.

A man allegedly entered in girls hostel

అతని చేష్టలకు మెలకువవచ్చిన బాలికలు కేకలు వేశారు. అయితే విద్యార్థినులు కేకలు వేసిన అరగంటకు కానీ వార్డెన్, ప్రిన్సిపాల్ రాలేదు. ఈ లోగా ఆగంతకుడు దుప్పటి కప్పుకుని పరారయ్యాడు. 7వ తేదీన కొంతమంది తల్లిదండ్రులు రావడంతో విద్యార్థినులు జరిగిన విషయం వారికి వివరించారు.

వారి ఫిర్యాదుతో జడ్పీ ఛైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫసర్ శేషుకుమారి, సోషల్ వెల్ఫేర్ జోనల్ శేషుకుమారి విచారించారు. ఆగంతకుడి రూపంలో విద్యార్థినుల దగ్గరికి వెళ్లింది ప్రిన్సిపాల్ భర్తేనని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు , దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+