దారుణం: కళ్లల్లో కారం చల్లి స్నేహితుని గొంతు కోశాడు

-

-

fdhgfghghfg

fdhgfghghfg

fghfghfghgfhgf
-

-

-

fhg-

fhg-

fdhg
-

fghfdg

fghfdg

fdhgfdhgdfghghfdhggh
knife
అనంతపురం/గుంటూరు: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ధర్మపురంలో డిగ్రీ విద్యార్థిపై అతడి స్నేహితుడే కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. ధర్మవరంలోని ఇందిరానగర్‌కు చెందిన సోమశేఖర్‌పై అదే ప్రాంతానికి చెందిన హరి అనే అతని స్నేహితుడు కత్తితో దాడి చేశాడు.

సోమశేఖర్ కళ్లల్లో కారం పొడి చల్లిన హరి కత్తితో అతని గొంతుకోశాడు. అడ్డుకునేందుకు వచ్చిన సోమశేఖర్ బంధువులపైనా దాడికి ప్రయత్నించాడు. సోమశేఖర్‌తో స్నేహంగా ఉండే హరి ఇలా దాడి చేయడంతో కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. తీవ్రంగా గాయపడిన సోమశేఖర్‌ను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కాగా నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన గొడవలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది.

ఫ్లెక్సీ వివాదం: ఇరువర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు: జిల్లాలోని క్రోసూరు మండలం నాగవరంలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఘర్షణల్లో పది మందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఐదు ఆటోలను ధ్వంసం చేయడంతోపాటు ఓ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అక్కడి చేరుకున్న పోలీసులు వివాదం సద్దుమణిగేందుకు చర్యలు చేపట్టారు.

మరో ఘటనలో చిలుకలూరిపేట మండలం పండరీపురంలోని ఎన్టీఆర్ కాలనీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురికి కత్తిపోటు గాయాలయ్యాయి. దీంతో వీరిని స్థానికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+