Palnadu: సీసీ రోడ్డు పైనే గోడ కట్టేశాడు.. ఎందకంటే..!
సాధారణంగా చాలా మందికి పక్కింటివారితోనో లేక ఎదురింటి వారితోనో గొడవలు జరుగుతుంటాయి. చెత్త బయటకు వెస్తున్నారనో లేక మురికి నీరు వస్తుందనో లేక బండ్లు అడ్డం పెడుతున్నారనో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఈ చిన్న చిన్న గొడవలకు వారు మాట్లాడుకోకపోవడం చేస్తుంటారు. లేకుంటే వారు కనిపించకుండా తలుపులు వేసుకుంటారు.
కానీ ఓ చోట ఎదురింటి వారితో గొడవకు దిగిన ఓ వ్యక్తి సీసీ రోడ్డుపై ఏకంగా గోడ కట్టేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఏపీలోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన కిలారు చంద్ర శేఖర్, కిలారు లక్ష్మీ నారాయణ ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. వీరిద్దరికి గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. ఈ గొడవ కాస్త పంచాయతీ వరకు వెళ్లింది.

ఊరి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ కూడా నిర్వహించారు. ఇటీవల ఈ గొడవలు కాస్త పెద్దవయ్యాయి. ఇటీవల చంద్రశేఖర్ తన ఇంటి ముందు మురికి కాలువపై మెట్టు కట్టడంతో లక్ష్మీనారాయణ ఏకంగా తన ఇంటి ముందున్న సీసీరోడ్డు మధ్యలో గోడ కట్టేశాడు. ఈ విషయంపై పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.గొడవలు జరిగితే పంచాయతీ పెట్టి మాట్లాడుకోవాలి కానీ.. ఇలా రోడ్డుపై రోడ్డు వేయడం ఏంటని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications