పాతిపెట్టేందుకు గొయ్యి సిద్ధం చేసి.. పాడెపై స్మశానానికి తీసుకెళ్తుండగా .. మదనపల్లెలో షాకింగ్ ఘటన
ఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి చనిపోయాడని అంతా అనుకున్నారు . గుర్తు తెలియని వ్యక్తి కావటంతో అతను ఎవరో తెలీకున్నా చనిపోయాడని పక్కాగా నిర్ధారించుకున్నాక , అతనికి అంతిమ సంస్కారం చేయాలని నిర్ణయం తీసుకొని ఆ వూరి గ్రామస్తులు రెడీ అయ్యారు. పాడెపై మోసుకు వెళుతుండగా సడెన్ గా ఒక షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అప్పటివరకు చనిపోయాడు అనుకున్న వ్యక్తి పాడె పైనుండి దిగ్గున లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడి వాళ్లంతా భయంతో పాడె కిందకి దించి పరుగులు పెట్టారు.

మదనపల్లె మండలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని కన్ఫార్మ్ చేసుకున్న గ్రామస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదన పల్లె మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులు షాక్ కు గురి చేసింది. ఇక వీఆర్వో చెప్పిన వివరాల ప్రకారం గుర్తు తెలియని ఒక వ్యక్తి మండలంలోని కట్టు బావి గ్రామంలో ఓ చెట్టుకింద రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయం గుర్తించిన గ్రామస్తులు గ్రామ కార్యదర్శి మనోహర్ కు, వీఆర్వో నాగరాజు కు సమాచారం అందించారు. అందరూ అక్కడికి చేరుకొని అతన్ని పరిశీలించి, ఫైనల్ గా చనిపోయాడని నిర్ధారించుకున్నారు .

పాతిపెట్టేందుకు గొయ్యి సిద్ధం చేసి .. పాడెపై మోసుకెళ్తుండగా లేచి కూర్చున్న వ్యక్తి
గుర్తు తెలియని వ్యక్తి అయినప్పటికీ చనిపోయిన శవాన్ని అక్కడే ఉంచకుండా ఊరికి సమీపంలో గుంత తవ్వి పాతి పెట్టాలని భావించారు. ఇక పాడె కట్టి, పాడెపై శవాన్ని ఉంచి , మోసుకు వెళుతుండగా పాడెపై అప్పటివరకు శవం అనుకున్న వ్యక్తి కాస్తా దిగ్గున లేచి కూర్చున్నాడు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ తిని అక్కడి నుంచి పరుగులు పెట్టారు. బ్రతికి ఉన్న అతను సైతం ఏం జరిగిందో అర్ధం కాక షాక్ కు గురయ్యాడు. అతను చనిపోలేదని గుర్తించిన గ్రామస్తులు వెంటనే అతడిని 108 వాహనంలో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించడంతో కోలుకున్నాడు.

గ్రామస్తులు కన్ఫ్యూజ్ అయ్యారా ? లేకా చనిపోయి బ్రతికొచ్చాడా స్థానికంగా చర్చ
అయితే అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనపై చిత్తూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి గ్రామస్తుల పొరబాటో లేకా రెండు రోజుల నుంచి లేవని వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చున్న వింతనో తెలీదుగానీ చచ్చిపోయాడు అనుకున్న వ్యక్తి మాత్రం తిరిగి బతికొచ్చాడు . పాతిపెట్టటానికి గొయ్యి కూడా తవ్వి అంతా రెడీ చేశాక లేచి కూర్చున్నాడు . గ్రామస్తులు కన్ఫ్యూజ్ అయ్యారా ? లేకా చనిపోయి బ్రతికొచ్చాడా ? స్థానికంగా చర్చ సాగుతుంది. కట్టు బావి గ్రామంలో వారు ఈ ఘటన ఇచ్చిన షాక్ నుండి ఇంకా కోలుకోలేదంటే నమ్మి తీరాల్సిందే.
అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా?
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications