TTD: తిరుమలలో హైఅలర్ట్ - భక్తులకు కీలక సూచనలు..!!

Tirumala: పహల్గాం ఉగ్రదాడితో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేసారు. పోలీసులు.. విజిలెన్స్ అలర్ట్ అయింది. ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందో బస్తు ఏర్పాటు చేసారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఏదైనా ఘటన జరిగితే సయామత్తంలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇదే సమయంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది.

తిరుమలలో అలర్ట్
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్ర దాడితో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అలర్ట్ అయ్యింది. తిరుపతి, తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తిరుపతిలో ఉన్న ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్‌, విష్ణునివాసం, మాధవం, అన్ని ఆలయాల దగ్గర ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతిలో అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్‌లు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాల్లో తనిఖీ చేశారు. అలాగే ఆలయాల దగ్గర భద్రత పెంచారు.. వాహనాల తనిఖీలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం పైభాగంలో, గొల్లమండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుమలలోని సీసీ కెమెరాల పనితీరుపై దృష్టిసారిం చారు. సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైనా నిఘా ఉంచాలని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందిని ఆదేశించారు.

a-mock-drill-was-conducted-by-the-security-forces-in-tirumala

ముమ్మర తనిఖీలు
తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేసాయి. అలిపిరి సమీపంలో చెక్‌ పాయింట్‌ దగ్గర భద్రతను పెంచారు.. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమల రెండు ఘాట్‌ రోడ్లలో కూంబింగ్‌ చేపట్టారు.. ఘాట్‌లోని లింకు రోడ్డులో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే బాంబు నిర్వీర్యం చేసే దళాలు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాలు పరిశీలిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రత పెంచారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న సుద‌ర్శ‌న్‌ స‌త్రంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.

Take a Poll

మాక్ డ్రిల్
ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్‌, రూమ్ ఇన్ట‌ర్వెన్ష‌న్ కార్య‌క‌లాపాలు చేసి చూపారు. దాదాపు ఒక‌టిన్న‌ర గంట‌పాటు ఈ మాక్ డ్రిల్ కొన‌సాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోప‌స్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో భాగ‌మ‌య్యారు. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవిలో రద్దీ పెరుగుతున్న వేళ భక్తులకు తమ దర్శన సమయానికి క్యూ లైన్లలోకి రావాలని టీటీడీ సూచిస్తోంది. అదే సమయంలో భద్రతా చర్యల్లో భాగంగా సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+