వేధింపులు భరించలేక కన్న కొడుకును నరికి చంపిన తల్లి
నిజామాబాద్: చిత్రహింసలు పెడుతున్న వికలాంగ తనయుడిని కన్న తల్లి గొడ్డలితో నరికి చంపేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... బాన్సువడలోని కోటగల్లీకి చెందిన వనం రవి(28) పుట్టుకతో వికలాంగుడు. అతనికి రెండు చేతులు చచ్చుబడిపాయాయి. దీంతో చిన్ననాటి నుంచి అతని ఆలనాపాలనా అతని తల్లి భూదవ్వే చూసేది. స్నానం చేయించడం, అన్న తినిపించడం వరకూ అన్ని పనులూ దగ్గరుండి చేసేది.
ఈ మధ్య తాగుడుకు అలవాటుపడిన రవి.. తల్లిని నానా రకాలుగా వేధిస్తూ హింసించడం ప్రారంభించాడు. కొడుకు పెట్టే చిత్రహింసలు భరించలేక.. తల్లి భూదవ్వ అతనిపై గొడ్డలితో దాడిచేసింది.

తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై గొడ్డలితో దాడి: తాళి అపహరణ
వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం సిగ్నల్‌తండాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ధనమ్మ అనే మహిళపై గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
అనంతరం మహిళ మెడలోంచి మూడున్నర తులాల పుస్తెలతాడును దొంగిలించి పరారయ్యారు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications