బాలికపై వృద్ధుడి లైంగిక దాడి: మరో ఘటనలో..

A Old Man allegedly raped a minor girl in Hyderabad
హైదరాబాద్/రాజమండ్రి: రాష్ట్ర రాజధాని నగరంలో దారుణం చోటు చేసుకుంది. తన మనువరాలు వయస్సున్న బాలికపై ఓ వృద్ధుడు కామవాంఛతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరింపులకు గురిచేశాడు. హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిరుమలగిరిలోని పెద్ద కమేళాలో నివాసం ఉంటున్న వృద్ధుడు తన ఇంటిపక్కనే ఉండే బాలికపై కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగం నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆ బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి అతని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తానని బాలికను బెదిరింపులకు గురి చేశాడు.

నిందితుని బెదిరింపులకు తనలో దాచుకున్న విషయాన్ని, ఆ బాలిక ఎనిమిదిరోజుల తర్వాత తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ప్రేమించలేదని బాలికపై కిరోసిన్ దాడి

తూ.గో: తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ యువకుడు తన ప్రియురాలైన బాలికపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. పిఠాపురంలోని వేణుగోపాలస్వామి గుడివీధిలో నివసిస్తున్న బాలికపై ఆ యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు.

దాడిలో తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం బాలికను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. గత కొంతకాలంగా ఆ యువకుడు బాలికను వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆ బాలికను పాఠశాల మాన్పించి వేరే యువకునితో వివాహం చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+