ప్రేమే నేరం: కూతురిని చంపి తండ్రి ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం - షరీపుద్దీన్ అనే వ్యక్తి కూతురు మరో మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేని షరీఫుద్దీన్ కూతురిని హత్య చేశాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
పోలీసుల విచారణలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేశారని తేలింది. దీంతో నిజం అందరికీ తెలిసిందని మనస్తాపానికి గురై షరీఫుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం షరీఫుద్దీన్ కూతురు మరణించింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో కొబ్బరి లోడుతో వెళ్తున్న మినీ లారీ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురం వాస్తవ్యులుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications