దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

ఎపిలో దళితులపై వరుస దౌర్జన్య ఘటనలు...ఎస్సీ నేతల ఆందోళన

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంపై దళిత నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్న విశాఖలో మహిళను దుస్తులు లాగి కొట్టిన ఘటన మరువక ముందే కర్నూలు జిల్లాలో దళితుల సామాజిక బహిష్కరణ, గొట్టిపాడులో పరస్పర దాడుల ఘటనలు చోటుచేసుకోవడంపై దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  విశాఖలో ఒక భూ వివాదానికి సంబంధించి దళిత మహిళను గుడ్డలూడేలా కొట్టిన ఘటన, ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే దళితులకు సంబంధించి రాష్ట్రంలో మరో రెండు పెద్ద ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  కర్నూలు జిల్లా నక్కల దిన్నెలో ఎట్టి పనిని చెయ్యనందుకు దళితులపై సామాజిక బహిష్కరణ విధించగా, గుంటూరు జిల్లా గొట్టిపాడులో దళితులు దౌర్జన్యానికి దిగారంటూ వారిపై మరో సామాజిక వర్గం దాడులకు దిగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

   కర్నూలులో పరిణామాలు...

  కర్నూలులో పరిణామాలు...

  కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామంలో దళితుల సామాజిక బహిష్కరణ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అగ్రవర్ణాలకు చెందిన 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి వరప్రసాద్‌, మంగళవారం నక్కలదిన్నె గ్రామాన్ని సందర్శించి దళితవాడలో పర్యటించి బాధితులతో మాట్లాడి పరిస్థితిలు తెలుసుకున్నారు.

   జాకెట్ కూడా తీసేసి మహిళను ఎలా కొట్టారో చూడండి, వీడియో !

   "ఎట్టి" చేయలేదని...వెలి వేస్తారా...

   నక్కలదిన్నె గ్రామంలో పూర్వకాలం నుంచి దాదాపు 20 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో ఆచారం ప్రకారం 4 కుటుంబాలు సూది జయన్న, లేగల ఎలీషా, జవాధి పుల్లన్న, దేవరాజులు మాత్రమే ఎట్టి (మనిషిని ఖననం చేసేందుకు గుంత తవ్వడం) పనులు చేసేవారు. కాలక్రమేణా దళితులు అక్షరాస్యులుగా మారి ఎత్తిపనులకు వెళ్లడం మానుకున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం నక్కలదిన్నె గ్రామంలో ఆగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి చనిపోయాడు. ఎత్తి పనులకు రావాలని దళితులను పిలిచారు. దీంతో ఎవరూ వెళ్లకపోవడంతో అగ్రవర్ణాల వారే స్వయంగా జెసిబి సహాయంతో గుంతను తవ్వుకొని, చనిపోయిన వ్యక్తిని పూడ్చుకున్నారు. ఆగ్రహించిన అగ్రవర్ణాల వారు అదే జెసిబితో ఎస్సీ కాలనీకి వెళ్లే పైపులైన్‌ను ధ్వంసం చేశారు. విద్యుత్‌, నిత్యవసర సరుకుల సరఫరాను నిలిపివేశారు. 20 కుటుంబాల దళితులు గ్రామం విడిచి వెళ్లకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు.

   ప్రాణహాని ఉంది

   ప్రాణహాని ఉంది

   ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి వరప్రసాద్‌, మంగళవారం నక్కలదిన్నె గ్రామాన్ని సందర్శించి దళితవాడలో పర్యటించి బాధితులతో మాట్లాడి పరిస్థితిలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ప్రాణహాని ఉందని నరహరికి దళితులు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. అనంతరం నరహరి మాట్లాడుతూ దళితులను వేధింపులకు గురి చేసినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసాం. నీటి సరఫరా నిలిపి వేయడంతోపాటు సామాజికంగా బహిష్కరించడం కూడా నేరమే. ఇందుకు పాల్పడిన 11 మందిని అరెస్టు చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. దళితులపై ఎటువంటి దాడులు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసుల రక్షణ కల్పించామని తెలిపారు.

    మరోవైపు...గొట్టిపాడులో...తీవ్ర ఉద్రిక్తత

   మరోవైపు...గొట్టిపాడులో...తీవ్ర ఉద్రిక్తత

   గుంటూరు జిల్లాల్లో కొత్త సంవత్సర వేడుకలు గొడవలు, కొట్లాటలతో మొదలయ్యాయి. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో కొత్త సంవత్సర వేడుకల్లో తలెత్తిన వివాదం కొట్టుకునేంత వరకు వచ్చింది. ఇరుపక్షాలు రాళ్లు రువ్వుకోవడంతో గ్రామం రణరంగంగా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. ముందు దళితులపైనే దాడి జరిగిందని, అందుకు వారు ప్రతిదాడికి దిగడంతో ఘర్షణలు తలెత్తాయని స్థానికులు చెబుతున్నారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంతకంతకూ ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. ప్రస్తుతం ఇరు వర్గాలతో పోలీసులు చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు.

   English summary
   Dalit leaders have expressed concern over the ongoing violence incidents related to Dalits in Andhra Pradesh. The Dalit leaders have expressed their displeasure over the incidents of social exclusion and discrimination of the Dalits in Kurnool district.  The incident that hit a Dalit woman in a land dispute in Visakhapatnam was a state-wide sensation,within days of this incident background, two other major incidents have taken place in the state about dalits.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more