జగన్ కు షాక్.. వైసీపీకి రావెల రాజీనామాతో పడిన తొలి వికెట్.. చంద్రబాబుపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి భారీ విజయం సాధించింది. ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈనెల 12వ తేదీన ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం కొలుపు తీరనుంది. అటు ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని మూడు రోజులైనా కాకముందే అప్పుడే జగన్ కు షాక్ ఇచ్చే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంపింగ్ ల పర్వం మొదలైనట్టుగా కనిపిస్తుంది.
వైసీపీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు
వైసిపి ముఖ్య నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు .దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని రావెల కిషోర్ బాబు ప్రకటించారు. ఇక ఇదే సమయంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబు పై ప్రశంసలు జల్లు కురిపించారు. తాను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పని చేశానని రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు.

చంద్రబాబును మెచ్చుకున్న రావెల
2014లో తనకు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించారని, ఈ సందర్భంగా చంద్రబాబును గుర్తుచేసుకొని కృతజ్ఞతలు తెలిపారు.
అయితే వైయస్ జగన్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానని మాటలు చెప్పారని ఆ మాటలు నమ్మి తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాను అన్నారు.
జగన్ ను జనం తిరస్కరించారు
అయితే ఎన్నికలలో మెజారిటీ ప్రజలు జగన్ ను తిరస్కరించారని, చంద్రబాబుకు పట్టంకట్టారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వలన సాధ్యమవుతుందని ఈ క్రమంలోనే ప్రజలు కూడా టిడిపి కూటమికి అఖండ విజయం ఇచ్చారని రావెల కిషోర్ బాబు కొనియాడారు. ఇంకోవైపు మంద కృష్ణ మాదిగ 40ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలతో ఆ అంశం ముగింపుకు వచ్చినట్టే భావిస్తున్నాను అన్నారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరుతా
ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు కూడా వర్గీకరణకు మద్దతు ఇస్తారని తెలిపారు. అందుకే తాను వైసిపి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం నెరవేరే దాకా తాను ఉద్యమాన్ని కొనసాగిస్తానని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని రావెల కిషోర్ బాబు వెల్లడించారు.
రావెల రాజకీయ ప్రయాణం ఇలా
గతంలో 2014 ఎన్నికలలో గుంటూరు జిల్లా ప్రత్తిపాటి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బిజెపిలో చేరారు. తర్వాత మళ్లీ పార్టీకి గుడ్ బై చెప్పి కేసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఇక కొంతకాలం తర్వాత బిఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రావెల కిషోర్ బాబు .ఇప్పుడు రావెల కిషోర్ బాబు వైసీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications