ఏపీలో జికా వైరస్ కలకలం - బిగ్ అలర్ట్..!!
ఏపీలో జికా వైస్ కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో, స్థానికులు ఆందోళ నకు గురయ్యారు. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాలుడి రక్త నమూనాలను పూణే ల్యాబ్ కు పంపారు. బాలుడికి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. బాలుడు గ్రామంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా తరువాత అందరినీ భయపెట్టిన జికా వైరస్ మరోసారి కనిపించింది. జికా వైరస్ లక్షణాలతో ఆరేళ్ల బాలుడుని గుర్తించారు. వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమై చర్యలు తీసుకుంది. బాలుడి రక్త పరీక్షలు సేకరించింది. ఆ గ్రామంలో ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా అని ఆరా తీస్తోంది. ఎవరూ ఎటువంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఇదే సమయంలో జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. బాలుడికి జికా వైరస్ సోకిందని నిర్దరణ కాలేదని చెప్పారు. బాలుడికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు చెన్నైకు తరలించామని వెల్లడించారు.

వ్యాధి సోకిన బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి ఆనం ప్రకటించారు. అదే విధంగా బాలుడి కి జికా వైరస్ సోకిందనే అనుమానంతో గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని..ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గ్రామంలో మొత్తం 150 గృహాలు ఉండగా ప్రతి కుటుంబానికీ వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరూ పుకార్ లను నమ్మవద్దని సూచించిన మంత్రి ఆనం..అదే సమయంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్థులను కోరారు.












Click it and Unblock the Notifications