తల్లికి గుడి కట్టిన తనయుడు.. ఆముదాలవలసలో అద్భుతంగా అమ్మ దేవస్థానం!!
నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉన్న నేటి రోజుల్లో, ఓ కొడుకు తన తల్లి కోసం ఏకంగా గుడినే కడుతున్నాడు. పురాణాలలో ఆనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణ కుమారుడు పుణ్యక్షేత్రాలను తిప్పితే, ప్రస్తుతం తల్లికి ఆలయాన్ని నిర్మిస్తున్నాడు ఆమదాలవలస మండలానికి చెందిన శ్రవణ కుమారుడు.

తల్లి కోసం రాతితో అద్భుతంగా ఆలయం నిర్మిస్తున్న కొడుకు
ఆమదాలవలస మండలంలోని చీమల వలసకు చెందిన సనపల శ్రవణ్ కుమార్ తన కన్నతల్లి ఏకంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఏదో ఇటుకలు సిమెంటు పెట్టి, నాలుగు గోడలు కట్టి నిర్మిస్తున్నాడు అనుకుంటే తప్పులో కాలేసినట్టే, రాతితో, వాస్తు విశేషాలతో, భగవంతుని కోసం ఆలయాలను ఏ విధంగా అయితే నిర్మిస్తారో అదేవిధంగా శ్రవణ్ కుమార్ తన తల్లి అనసూయదేవి కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నాడు.

యాదాద్రి ఆలయ నిర్మాణం చూసి అమ్మ కోసం అదే రాతితో గుడి
శ్రవణ్ కుమార్ తల్లి అనసూయ దేవి 2008వ సంవత్సరంలో మృతిచెందారు. ఆమె చనిపోయి ఇంతకాలం అయినప్పటికీ, తల్లి జ్ఞాపకాలను మరిచిపోలేని శ్రవణ్ కుమార్ అమ్మ కోసం గుడి కట్టాలనుకున్నాడు. వ్యాపారరీత్యా హైదరాబాదులో స్థిరపడిన ఆయన చీమల వలసలో 2018 లో గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో అక్కడకు వెళ్లి అక్కడి రాతి నిర్మాణ విశేషాలను తెలుసుకుని వచ్చిన శ్రవణ్ కుమార్ అటువంటి రాతితోనే అమ్మకు అద్భుతంగా గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.

వందల ఏళ్ళ పాటు ఉండేలా రాతి బంధన విధానంలో అమ్మ దేవస్థానం
వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండే విధంగా గరుడు సున్నం, కరక్కాయ, బెల్లం, కొబ్బరి పీచు, తుమ్మ బంక, ఇసుక యంత్రాలలో మిశ్రమం చేసి నెలరోజులపాటు పులియబెట్టి ఆ మిశ్రమంతో, ఎక్కడా సిమెంటును వాడకుండా రాతి బంధన విధానంలో తల్లికి గుడి కడుతున్నారు. తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుండి శిల్పులను తీసుకువచ్చి ఏక కృష్ణ శిలలపై శిల్పాలను చెక్కి స్తున్నారు. అంతేకాదు అమ్మ దేవస్థానం పేరుతో తన తల్లి పేరుమీద సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చెయ్యాలని శ్రవణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.

అమ్మ దేవస్థానం పేరుతో అనేక సేవా కార్యక్రమాలు
ఇక ఇందులో భాగంగా శ్రవణ్ కుమార్ అమ్మ దేవస్థానం ఆవరణలో నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రవణ్ కుమార్ చెబుతున్నారు. ఏది ఏమైనా అమ్మ మీద ప్రేమతో అత్యద్భుతంగా గుడి కడుతున్న కొడుకు పై స్థానికంగా ప్రశంసలు వెల్లువ గా మారాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications