బీర్ బాటిల్‌తో మహిళ తలపగలగొట్టిన కానిస్టేబుల్: ఇద్దరు మహిళల దారుణ హత్య
అనంతపురం: జిల్లాలో ఇద్దరు మహిళలు దారుణ హత్య గురయ్యారు. మొదటి ఘటనలో గోరంట్ల మండలం బూదిలిగొల్లపల్లి సమీపంలోని అక్కమ్మదొన ప్రాంతంలో గుర్తుతెలియని ఓ మహిళ(45) దారుణ హత్యకు గురైంది. ఆనవాళ్లు దొరక్కుండా దుండగులు ఆమె ముఖం మీద పెట్రోలు పోసి కాల్చారు.
అనంతరం ఆమెను ఉపాధి హామీ పనుల్లో తీసిన గుంతల్లో పడేసి చెత్తవేశారు. మంగళవారం అటుగా వచ్చిన వారికి ఆమె శవం కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరులో మహిళ దారుణ హత్య
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండల కేంద్రంలోని గాంధీమైదానం వద్ద మంగళవారం సారగడ పైడితల్లి(45) అనే మహిళను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. సదరు మహిళ, యువకుడు ఇద్దరూ కలసి మద్యం సేవించారు.
అనంతరం ఆమెను ఇంట్లో హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
మహిళపై కానిస్టేబుల్ వీరంగం
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. బీర్ బాటిల్‌తో ఓ మహిళ తలను పగలకొట్టాడు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరంలోని సిద్దయ్యగుట్ట కాలనీలో వినాయకుని మండపం తొలగించాలని సుశీల అనే మహిళ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను కోరింది.
ఈ విషయంపై ఆగ్రహం చెందిన కానిస్టేబుల్ బీర్ బాటిల్ తీసుకుని సుశీల తల పగిలేలా కొట్టాడు. సుశీల తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన బంధువులు, స్థానికులు, దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications