ప్రియురాలి కూతురిని తనతో పడుకోవాలన్నాడు.. చివరికి..
అనంతపురం : మాజీ ప్రియురాలి కూతురిపై కన్నేసిన ఓబిలేశు అనే వ్యక్తి.. కోరిక తీర్చాలంటూ ఆమె వేధించుకు తినడం మొదలుపెట్టాడు. విషయం కాస్త మాజీ ప్రియురాలు గంగమ్మకి తెలియడంతో.. పక్కా ప్లాన్ ప్రకారం ఓబిలేశును దారుణంగా హత్య చేయించింది . పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జగరాజుపల్లికి చెందిన ఓబిలేశుకు అదే గ్రామానికి చెందిన గంగమ్మతో అక్రమ సంబంధం ఉండేది. అయితే ఓబిలేశును కాకుండా కొత్తచెరువుకు చెందిన పోతులయ్య అనే వ్యక్తిని ఆమె వివాహాం చేసుకున్న గంగమ్మ ఆ తర్వాత కూడా అతనితో సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది.
ఆ సమయానికి 2005లో భార్య హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు ఓబిలేశు. ఇదే క్రమంలో అతన్ని పెరోల్ పై రెండుసార్లు బయటకు బయటికి తీసుకొచ్చింది గంగమ్మ. ఆ తర్వాత కాలంలో ఓబిలేశు శిక్షాకాలం పూర్తి కావడంతో గత ఆగస్టు 15న బెంగళూరు జైలు నుంచి ఓబిలేశు విడుదలయ్యాడు. అనంతరం బెంగుళూరులోనే ఉంటూ.. తిరుమల, కసాపురం పుణ్యక్షేత్రాలకు గంగమ్మ, ఓబిలేశు ఇద్దరు కలిసి వెళ్లొచ్చారు.

అదే సమయంలో ఓబిలేశు కన్ను గంగమ్మ కూతురిపై పడింది. ఇదే విషయాన్ని గంగమ్మతో చెబితే ఏదో మాట చెప్పి తప్పించుకోవడం మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత ఓబిలేశు వేధింపులు ఎక్కువైపోయాయి. గంగమ్మ లేనప్పుడు ఆమె కూతురిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. దీంతో ఇక అతన్ని మట్టుపెట్టడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చింది గంగమ్మ.
ఇందుకోసం జగరాజుపల్లికి చెందిన దివాకర్‌రెడ్డితో కలిసి ఓబిలేశు హత్యకు కుట్ర పన్నింది. ముదిగుబ్బకు చెందిన నాగేంద్రరెడ్డి, ముష్కిన్, దివాకర్‌రెడ్డి, కలిసి ఓబిలేశును హత్య చేయడానికి ప్లాన్ చేశారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం.. ఓబిలేశు కోరిక తీరుస్తానంటూ గంగమ్మ కూతురు అతన్ని ఊరి చివరికి తీసుకొచ్చింది. అప్పటికే ఓబిలేశు కోసం కాచుకు కూర్చున్న దివాకర్ రెడ్డి గ్యాంగ్ అతడిపై ఎటాక్ చేసింది. డ్రిప్ వైరుతో ఓబిలేశు గొంతుకు ఉరివేసి.. ఆపై.. అతడి తలపై పెద్ద పెద్ద బండరాళ్లు ఎత్తేసి హత్య చేశారు.
అయితే హత్య చేసినందుకు గాను గంగమ్మ కుదుర్చుకున్న 40వేల ఒప్పందంపై నాగేంద్రరెడ్డి, ముష్కిన్, దివాకర్‌రెడ్డి చర్చిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు అందరిని అరెస్టు చేశారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందికి రివార్డులను అందజేస్తామని డీఎస్పీ అధికారి చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications